Begin typing your search above and press return to search.

సాహో బ్యూటీ మళ్ళీ పడిందట!

By:  Tupaki Desk   |   23 Aug 2018 10:27 PM IST
సాహో బ్యూటీ మళ్ళీ పడిందట!
X
లవ్ లో పడనివాళ్ళు ఎవరైనా ఉంటారా? దాదాపుగా ఉండకపోవచ్చు. కొంతమంది అయితే పడి కొన్ని రోజుల తర్వాత లేస్తారు. అదే కొంతమంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ను అనుకునే ఉన్న సర్వీస్ రోడ్ లో ప్రతి కిలో మీటర్ కు ఒక సారి వచ్చే పదిహేను స్పీడ్ బ్రేకర్లను దాటే సమయంలో బండి ఎగిరి పడి - పడి ఎగిరినట్టుగా లవ్ లో పడుతుంటారు లేస్తుంటారు. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బాలీవుడ్ హీరోలైన రణబీర్ కపూర్ లాంటి వాళ్ళు దాదాపు ఈ రెండో కేటగిరీనే.

ఇక శ్రద్ధా కపూర్ కూడా అదే రూట్ లో వెళ్ళాలని డిసైడ్ అయ్యిందేమో.. అంటే ఔటర్ సర్వీస్ రోడ్ లో డ్రైవ్ చేయలనుకోవడం కాదు. లవ్ లో పడడం -లేవడం మళ్ళీ పడడం అలా. ఇప్పటికే శ్రద్ధా కపూర్ బాలీవుడ్లో ఉన్న మల్టి టాలెంటెడ్ సెలబ్రిటీ ఫర్హాన్ అఖ్తర్ తో డేటింగ్ చేస్తోందని మీడియా కోడై కూసింది. ఇప్పుడు సేమ్ కోడి కొత్తగా ఫర్హాన్ ప్లేస్ లో రోహన్ శ్రేష్ఠ వచ్చాడని.. కొక్కోరోకో అంటోంది.

మరి ఈ రోహన్ శ్రేష్ఠ ఎవరు అంటే ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్. టైము దొరికితే చాలు కలసి ఎంజాయ్ చేస్తున్నారట. ఇదే విషయం పై రోహన్ ను అడిగితే మేమిద్దరం తొమ్మిదేళ్ళ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆమెతో డేటింగ్ చేయడం లేదు. మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాను. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి అన్నాడు. ఏంటో.. ఎవరి ఎవరితో డేటింగ్ చేస్తున్నారు.. ఎవరు ఈ విషయాలని బయటపెడుటున్నారో అంతా అయోమయంగా ఉంది. అది బాలీవుడ్డా.. 'హనుమాన్ జంక్షన్' లో సెకండ్ హాఫా?