Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఈమె ఇంకా 'ఇష్టం' వద్దే ఆగిపోయిందా?

By:  Tupaki Desk   |   14 July 2021 6:45 AM GMT
ఫొటోటాక్‌ : ఈమె ఇంకా ఇష్టం వద్దే ఆగిపోయిందా?
X
టాలీవుడ్‌ లో కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే దశాబ్ద కాలంకు పైగా కొనసాగుతూ ఉన్నారు. కాని ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ లో శ్రియ మాత్రం ఏకంగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఈమద్య కాస్త సినిమాలు తగ్గినా కూడా ఆమెకు తగ్గ పాత్రలు ఆమె క్రమం తప్పకుండా చేస్తూనే ఉంది. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు అయినా ఆమె చేస్తోంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మూవీ ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో కూడా ఈమెకు కీలక పాత్రను జక్కన్న ఇచ్చాడు అంటే ఆమె క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇరవై ఏళ్లుగా ఒకే తరహాలో అందంగా కనిపిస్తూ వస్తున్నందు వల్లే ఈ అమ్మడికి ఇప్పటికి కూడా ఆఫర్లు వస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

ముద్దుగుమ్మ శ్రియ శరన్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగానే ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు ఏదో ఒక ప్లాట్‌ ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్‌ సినిమాల నుండి మొదలుకుని ఐటెం సాంగ్స్ వరకు ఈమె చేస్తూనే ఉంది. ఇక సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫొటోలు వీడియోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఈమద్య భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు మరియు ఫొటోలను ఎక్కువగా షేర్‌ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది.

సోషల్‌ మీడియాలో శ్రియ షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అభిమానులు శ్రియ 2001 లో విడుదల అయిన ఇష్టం లో ఎలా అయితే కనిపించిందో.. ఆ సినిమాలో ఆమె నవ్వు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారను. ఆమె వయసు 20 ఎళ్ల క్రితమే పెరగడం ఆగిపోయిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రియను ఆకాశానికి ఎత్తుతూ ఆమె ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. చూస్తుండగానే కాలం ఇరవై ఏళ్లు గడిచి పోయినా ఆమె అందం మాత్రం తగ్గలేదు. మరో పదేళ్లు కూడా శ్రియ ఇదే అందంతో కొనసాగుతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.