Begin typing your search above and press return to search.
సిద్ధార్థ్ తో అదితీరావ్.. గుట్టు ఇదిగో ఇలా బయటకు..!
By: Tupaki Desk | 28 Oct 2022 4:09 AM GMTఅందాల కథానాయిక అదితీరావ్ హైదరీ ఒక ప్రముఖ సౌత్ హీరోతో ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు హీరో గారు ఎవరో ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పని లేదు. తమిళం తెలుగు-హిందీ లో పాపులర్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్ తో అదితి డేటింగ్ చేస్తోందని ఇప్పటికే అభిమానులకు సమాచారం ఉంది. సోహా అలీఖాన్.. శ్రుతిహాసన్ ల తో డేటింగ్ అనంతరం సిద్ధార్థ్ కి ఇది మూడో ప్రేమ. అతడు పెళ్లయిన వాడు. భార్యతో బ్రేకప్ గురించి చర్చ సాగింది. ఇప్పుడు అదితీతో ప్రేమాయణం చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్.
అదితీతో సిద్ధార్థ్ సహజీవనం గురించి ఇప్పటికే చెన్నై ముంబై వర్గాల్లో విపరీతమైన టాక్ ఉంది. ఆ ఇద్దరూ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారని కూడా గుసగుసలు వినిపించాయి.
ఈ జంట షికార్లు కూడా నిరంతరం హాట్ టాపిక్. తాజా సమాచారం మేరకు... అదితి - సిద్ధార్థ్ జం చెన్నైలో అదితి 36వ పుట్టినరోజును సెలబ్రేట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకల కోసం ఇద్దరు ఇప్పటికే ముంబై నుంచి చెన్నై వెళ్లిపోయారు. అయితే ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని అంగీకరించలేదు లేదా తిరస్కరించలేదు.
ప్రేమ పక్షులు అనేక సందర్భాల్లో కలిసి జంటగా కనిపించాయి. ముంబైలోను పలుమార్లు మీడియా కంటికి చిక్కినా తమ ప్రేమాయణం గురించి ఓపెనవ్వలేదు. సెప్టెంబరులో చెన్నైలో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఇద్దరూ కలిసి చివరిసారిగా హాజరయ్యారు. అంతేకాకుండా సిద్ధార్థ్ 43వ పుట్టినరోజు సందర్భంగా అదితి రావ్ హైదరి తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఒక అందమైన హృదయపూర్వకమైన నోట్ ను రాసింది.
''హ్యాపీ బర్త్డే మై పిక్సీ బాయ్… డ్రీమ్స్ అండ్ యూనికార్న్ లను ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉండేందుకు! అన్నవేళలా మ్యాజిక్ గా... పిచ్చిగా నవ్వులతో సాగండి... అంతులేని నవ్వు .. సాహసాల కోసం! .. ధన్యవాదాలు.. '' అని అదితీ రాసారు. అలాగే ''మీకు ఉమ్మ....! (sic) ఎంతగా ప్రేమించబడుతున్నారో మీకు బాగా తెలుసు'' అని కూడా అదితీ గుంభనగా వ్యాఖ్యానించడం ఆ ఇద్దరి మధ్యా బంధాన్ని ఆవిష్కరించింది.
సిద్ధార్థ్ ఇంతకుముందు హాట్ స్టార్ వెబ్ సిరీస్ 'ఎస్కేప్ లైవ్'లో నటించాడు. తదుపరి 'ఇండియన్ 2'... 'టక్కర్' చిత్రాల్లో కనిపించనున్నాడు. మరోవైపు అదితి చివరిగా 'హే సినీమిక' చిత్రంలో కనిపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'జూబ్లీ'లో కూడా కనిపిస్తుంది. అదితీకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇకపై మునుముందు భారీ సినిమాల్లో నటించేందుకు చర్చల్లో ఉందని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.