Begin typing your search above and press return to search.

7/జి సోనియాకి ఈ వారంలోనే పెళ్లి

By:  Tupaki Desk   |   24 July 2020 11:10 AM GMT
7/జి సోనియాకి ఈ వారంలోనే పెళ్లి
X
మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ స‌మ‌యం సెల‌బ్రిటీల మ‌న‌సు మార్చేస్తోందా? ఇన్నాళ్లు పెళ్లికి న‌య్ అనేసిన బ్యాచిల‌ర్స్ అంతా ఇప్పుడు ఎస్ అనేస్తున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. నిఖిల్ ఓ ఇంటివాడ‌య్యాడు. నితిన్ .. రానా పెళ్లికి ఇంకెంతో స‌మ‌యం లేదు. పెళ్లి ఏర్పాట్ల‌లో వీళ్లంతా బిజీ. ఈలోగానే 7/ జి క‌థానాయిక సోనియా అగ‌ర్వాల్ పెళ్లికి రెడీ అవుతోంద‌న్న వార్త ఒక్క‌సారిగా అంత‌ర్జాలాన్ని వేడెక్కించేస్తోంది. అస‌లింత‌కీ ఇది నిజ‌మా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

`7/జి బృందావ‌న కాల‌నీ` చిత్రంతో సోనియాకి ఇక్క‌డా వీర‌లెవ‌ల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మడికి సంబంధించిన ప్ర‌తిదీ హాట్ టాపిక్ గా మారాయి. అప్ప‌ట్లోనే ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ తో ప్రేమాయ‌ణం పెళ్లిపై వాడి వేడిగా చ‌ర్చ సాగింది. ఈ జంట నాలుగేళ్ల కాపురంలో క‌ల‌త‌లు చెల‌రేగ‌డంతో సోనియా అత‌డి నుంచి విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత సెల్వ‌రాఘ‌వ‌న్ త‌న అసిస్టెంట్ అయిన గీతాంజ‌లిని పెళ్లాడాడు. ఆ జంట‌కు పిల్ల‌లు ఉన్నారు.

అదంతా పాత క‌థ అనుకుంటే దాదాపు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు తాను పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు హింట్ ఇచ్చి హీట్ పెంచేసింది సోనియా. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటో చూసిన వారికి ఉన్న‌ట్టుండి సైలెంట్ గా షాకింగ్ వార్త చెబుతోందే! అంటూ కంగారు ప‌డ్డారు. సోనియా పెళ్లి ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ``ఇది తెలియాలంటే మ‌రో మూడు రోజులు వేచి ఉండండి`` అన్న కామెంట్ చ‌శాక సోనియా త‌న పెళ్లి కూతురు అవుతున్నాన‌ని హింట్ ఇస్తోందా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇది త‌న అప్ కం వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ ఫోటో అని కొంద‌రు గెస్ చేస్తున్నారు. సోనియా ప‌రాచికాలు ఆడుతోంద‌న్న కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.