Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ కి స్టార్ హీరో విసుగు పుట్టిస్తున్నాడా?

By:  Tupaki Desk   |   27 May 2022 2:30 AM GMT
డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ కి స్టార్ హీరో విసుగు పుట్టిస్తున్నాడా?
X
ద‌ర్శ‌కుల వ‌ల్ల హీరోలు, హీరోల వ‌ల్ల ద‌ర్శ‌కులు ఇబ్బందులు ప‌డుతుంటారు. అది సినిమా నిర్మాణంలో స‌ర్వ‌సాధ‌రణంగా జ‌రుగుతూనే వుంటుంది. ఇక్క‌డ ఈగోలని ప‌క్క‌న పెడితేనే ముందుకు వెళ‌తారు. అయితే అదే ఇగే హ‌ర్ట్ అయిందా ఆ ప్రాజెక్ట్ అట‌కెక్కిన‌ట్టే.. స్టార్ హీరో ఈగో హ‌ర్ట్ అయినా ఇదే ప‌రిస్థితి. ఇది చాలా సంద‌ర్భాల్లో బ‌య‌ట‌ప‌డింది కూడా. కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు చేతులు మారేలా చేసింది కూడా. ఒక‌రి భావాలకు ఒక‌రు గౌర‌వం ఇవ్వ‌న‌ప్పుడు చాలా వ‌ర‌కు కాంబినేష‌న్ లు సెట్ట‌యిన‌ట్టే అయి ఆ త‌రువాత మారుతుంటాయి.

అయితే కొంత మందికి మాత్రం ఈగోకి వెళ్ల‌క‌పోయినా సాటి వారి ప‌నుల వ‌ల్ల స‌హ‌నం న‌శించి ఈ ప్రాజెక్ట్ చేయ‌డం మ‌న‌కు అవ‌స‌ర‌మా? అనే ఆలోచ‌న‌లు రేకెత్తిస్తుంటాయి. ఇప్పుడు ఇదే త‌ర‌హా ఆలోచన‌లతో ఓ స్టార్ హీరో ప్రాజెక్ట్ కు ప‌ని చేయ‌లేక‌, ఆ ప్రాజెక్ట్ ని వ‌దులుకోలేక ఓ ద‌ర్శ‌కుడు, న‌టుడు స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తోంది.

త‌మిళంతో పాటు తెలుగులోనూ న‌టుడిగా త‌న స‌త్తా చాటుతున్న ద‌ర్శ‌క న‌టుడు ప్ర‌స్తుతం తెలుగులో వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. త‌మిళంలో ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతూనే త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో న‌టుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు.

అయితే ఈ డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ కి తెలుగులో స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. అదీ కూడా త‌ను త‌మిళంలో కీల‌క పాత్ర‌లో న‌టించి రూపొందించిన చిత్రాన్నే రీమేక్ చేసే అవ‌కాశం కావ‌డంతో ఎగిరి గంతేసి న‌ట‌ద‌ర్శ‌కుడు ఇప్ప‌డు స‌ద‌రు హీరో చేష్ట‌ల‌తో విసిగిపోయాడ‌ట‌.

ముందు అనుకున్న ప్ర‌కారం స‌ద‌రు స్టార్ హీరో సినిమాని ద‌ర్శ‌క‌న‌టుడు మేలో ప్రారంభించాల‌ని ప్లాన్ చేశాడు. మేక‌ర్స్ కూడా రెడీ కానీ స్టార్ హీరో ఇత‌ర క‌మిట్ మెంట్ల కార‌ణంగా అది సాధ్యం కాలేదు. ఇది ద‌ర్శ‌క న‌టుడికి షాకింగ్ గా అనిపించిందట‌. అంతే కాకుండా స‌ద‌రు స్టార్ హీరో ఈ ద‌ర్శ‌క న‌టుడితో రీమేక్ సినిమా చేయ‌డానికి డేట్స్ నే కేటాయించ‌లేద‌ట‌. దీంతో విసుడు పుట్టిన ద‌ర్శ‌క న‌టుడు ఎడా పెడా సినిమాల‌ని అంగీక‌రించ‌డం మొద‌లు పెట్టార‌ట‌.

ఒక వేళ స్టార్ హీరో రెడీ అన్నా కూడా తాను మాత్రం రెడీగా లేన‌ని చెప్ప‌డానికే ద‌ర్శ‌క న‌టుడు ఇలా వ‌రుస ప్రాజెక్ట్ ల‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఇప్ప‌డు టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో, ద‌ర్శ‌క న‌టుడు ఇలా ఎవ‌రికి వారే య‌మునా తీరే అనే స్టైల్లో ఎవ‌రి ప్రాజెక్ట్ ల‌లో వారు బిజీగా మార‌డంతో ఇద్ద‌రు క‌లిసి చేయాల‌నుకున్న త‌మిళ రీమేక్ ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.