Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కోసం 'రంగ‌స్థ‌లం 2' రాస్తున్నాడా?

By:  Tupaki Desk   |   23 Feb 2022 4:37 AM GMT
మెగాస్టార్ కోసం రంగ‌స్థ‌లం 2 రాస్తున్నాడా?
X
మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ కి కెరీర్ బెస్ట్ హిట్ ని ఇచ్చిన ఘ‌న‌త సుకుమార్ కే సాధ్య‌మైంది. అప్ప‌టివ‌ర‌కూ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న రామ్ చ‌ర‌ణ్ కి నటుడిగా మ‌రో లెవ‌ల్ అంటే ఏంటో చూపించింది సుకుమార్ క్రియేటివ్ ట్యాలెంటే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ చ‌ర‌ణ్ లాంటి ప్ర‌తిభావంతుడిని కొత్త‌గా ఎలా చూపించాలో రంగ‌స్థ‌లం చిత్రంతో సుకుమార్ ప్రాక్టిక‌ల్ గా చూపించారు. చెవి వినిపించ‌ని చిట్టిబాబుగా చ‌ర‌ణ్ పాత్ర‌ను సుకుమార్ అద్భుతంగా డిజైన్ చేసారు.

ఇక‌పోతే అత‌డు రామ్ చ‌ర‌ణ్ తో రంగ‌స్థ‌లం సీక్వెల్ తీస్తార‌న్న చ‌ర్చ కూడా అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు. కానీ ఈలోగానే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ని పుష్ప‌- ది రైజ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ ని చేసిన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ పుష్ప తర్వాత సుకుమార్ పాన్ ఇండియా దర్శకుడిగా మారాడు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి.

సుకుమార్ అల్లు అర్జున్ తో `పుష్ప: ది రూల్` చిత్రీక‌ర‌ణ‌ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఇంత‌లోనే అత‌డి త‌దుప‌రి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సుకుమార్ తో కలిసి చిరు ఓ భారీ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నారని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

మెగాస్టార్ తో సుక్కూ చాలా కాలంగా కలిసి పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల‌ చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ ద‌ర్శ‌కుల్ని ఫైన‌ల్ చేస్తూ బిజీగా ఉండ‌గా.. సుకుమార్ కూడా క‌థ‌ను నేరేట్ చేస్తున్నార‌ని టాక్ వినిపించింది. చిరుతో ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ తో ప‌ని చేయ‌నున్నార‌ని స‌మాచారం.

మ‌రో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. చిరుతో రంగ‌స్థ‌లం త‌ర‌హాలోనే మాస్ కంటెంట్ తో పాటు కాన్సెప్ట్ ఉన్న సినిమాని తెర‌కెక్కిస్తాడ‌ని అభిమానులు ఊహిస్తున్నారు.

మ‌రోవైపు పుష్ప పార్ట్-2 తర్వాత విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేయడానికి సుకుమార్ కి కమిట్ మెంట్ ఉంది. విజయ్ కూడా లైగర్ తర్వాత పూరీతోనే `జన గణ మన` సెట్స్ పైకి వెళ‌తాడు. అందువ‌ల్ల సుకుమార్ త‌న షెడ్యూల్స్ ని ప‌ర్ఫెక్ట్ గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. పుష్ప 2 త‌ర్వాత దేవ‌ర‌కొండ సినిమాని పూర్తి చేసి త‌దుప‌రి చిరుతో సెట్స్ పైకి వెళ‌తాడు.

ఈలోగానే మెగాస్టార్ కి ఉన్న వ‌రుస క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేసుకుని సుక్కూకి అందుబాటులోకి వ‌స్తార‌న్న‌మాట‌. ఆచార్య త్వ‌ర‌లో విడుద‌ల‌వుతోంది. త‌దుప‌రి చిరు న‌టిస్తున్న చిత్రాల జాబితా పెద్ద‌దే. గాడ్ ఫాద‌ర్ .. భోళా శంక‌ర్.. వాల్టేర్ వీర‌య్య వ‌రుస‌గా రానున్నాయి. ఇవ‌న్నీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ ఉన్న సంగతి తెలిసిన‌దే.