Begin typing your search above and press return to search.

బాల‌య్య బ‌ర్త్ డేకి 109..110 ఒకేసారా?

By:  Tupaki Desk   |   8 May 2023 3:00 PM GMT
బాల‌య్య బ‌ర్త్ డేకి 109..110 ఒకేసారా?
X
'గాడ్ ఆఫ్ మాసెస్' బాల‌కృష్ణ బ‌ర్త్ డే కి డ‌బుల్...ట్రిపుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారా? 109..110వ చిత్రాల‌కు సంబంధించిన అప్ డేట్ ఆ రోజున రాబోతుందా? వాటితో పాటు 108 ట్రీట్ డ‌బుల్ కిక్క్ ని ఇవ్వ‌బోతుందా? అంటే అవున‌నే ప్ర‌చారం మొద‌లైంది. ఇప్ప‌టికే బాల‌కృష్ణ 109..110వ చిత్రాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి. ప‌లు ద‌ర్శ‌కుల‌తో బాల‌య్య చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. కొన్ని స్టోరీలు లాక్ చేసి పెట్టారు. ఈ రేసులో సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తో పాటు యువ ద‌ర్శ‌కులున్నారు.

త‌న‌యుడు మోక్ష‌జ్ఞ పేరు కూడా వినిపిస్తుంది. ఆయ‌న హీరోగా న‌టించ‌నున్న సినిమాతోనో? మోక్ష‌ని లాంచ్ చేయాల‌ని భావిస్తున్నారు. అది 109వ చిత్ర‌మా? 110వ చిత్రంతోనా? అన్న‌ది క్లారిటీ లేదు. ఇలా ర‌క‌ర‌కాల సందేహాల న‌డుమ ఆ రెండు చిత్రాలు న‌లుగుతున్నాయి.

జూన్ 10న బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా వాట‌న్నింటి పై వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం ఉందంటున్నారు. ఏపీలో 2024 ఎన్నిక‌లు స‌మీపిస్తో న్న నేప‌థ్యంలో 109వ సినిమా 'అఖండ‌-2' అయితే బాగుంటుంద‌ని..అందుకోసం బోయ‌పాటి అయితేనే క‌రెక్ట్ అని అభిమానులు సైతం భావిస్తున్నారు.

పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లోనే 'అఖండ‌-2' చేస్తే బాగుంటుంద‌ని ఇప్ప‌టికే నెట్టింట క‌థ‌నాలు వెడెక్కిస్తు న్నాయి. అయితే వీట‌న్నింటిపై గాడ్ ఆఫ్ మాసెస్ వ‌చ్చే నెల‌లో క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. బాల‌య్య పుట్టిన రోజు వేడుక‌లు అంటే అంబ‌రాన్ని అంటాల్సిందే. ప్ర‌తీ ఏడాది ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా వేడుక‌లు నిర్వ‌హిస్తారు. అందులోనూ అభిమానులు పెద్ద ఎత్తున సెల‌బ్రేట్ చేస్తుంటారు.

వాళ్ల కోసం స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా సినిమా అనౌన్స్ మెంట్స్ లాంటివి ఇచ్చి తృప్తి ప‌ర‌చ‌డం బాల‌య్య ప్ర‌త్యేక‌త‌. మ‌రి ఈసారి అదే స‌న్నివేశాన్ని రిపిటీ్ చేస్తారా? కొత్త‌గా ఇంకేదైనా చేస్తారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం 108వ సినిమా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా టీజ‌ర్ సైతం ఆరోజున రిలీజ్ చేస్తార‌ని అభిమానులు భావిస్తున్నారు. మ‌రి అనుకున్న అప్ డేట్స్ అన్ని జూన్ 10న వ‌స్తే గ‌నుక అభిమానుల ఆనందానికి అవ‌ధులుండ‌వ్.