Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్ తో తమన్నా డేటింగ్.. నిజమేనా?

By:  Tupaki Desk   |   2 Jan 2023 4:30 PM GMT
బాలీవుడ్ స్టార్ తో తమన్నా డేటింగ్.. నిజమేనా?
X
గ్లామరస్ మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న తమన్నా భాటియా ఇటీవల కాలంలో సోలో హీరోయిన్ గా పెద్దగా విజయాలను అందుకోవడం లేదు. స్టార్ ఇమేజ్ అయితే అలానే ఉంది. కానీ ఆమె సక్సెస్ రేట్ మాత్రం చాలా వరకు తగ్గిపోయింది. ఏదేమైనా కూడా ఈ బ్యూటీ మాత్రం ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో తమన్నాను ఎవరూ కూడా అంత ఈజీగా మర్చిపోవడం లేదు. అయితే ఈ బ్యూటీ పెళ్లి గురించి కూడా చాలా కాలంగా అనేక రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. తమన్నా 2023లోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది అని ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో ఒక కథనాలు కూడా వచ్చాయి.

అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని తమన్నా ఓ సినిమా ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లుగా మరొక కొత్త టాక్ అయితే వినిపిస్తోంది.

ఎందుకంటే గత కొంతకాలంగా వీరు చాలా క్లోజ్ గా తిరుగుతున్నారు అని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి తోడు న్యూ ఇయర్ స్పెషల్ గా ఇద్దరు కూడా గోవాలో దర్శనం ఇవ్వడంతో వీరి మధ్యలో ఏదో కొనసాగుతోంది అనే విధంగా కూడా మళ్లీ వార్తలు మరింత ఉపందుకున్నాయి.

ఇప్పటివరకు ఈ విషయంపై తమన్నా పెద్దగా క్లారిటీ అయితే ఇచ్చింది లేదు. కానీ విజయ్ వర్మ అలాగే తమన్నాకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అని కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా అందులో వారు ముద్దులు కూడా పెట్టుకున్నారు అని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే తమన్నా ద్వారానే క్లారిటీగా తెలియాలి. తమన్న విజయవర్మ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ అయితే చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.