Begin typing your search above and press return to search.
గది నుంచి బయటికి వచ్చిన మిల్కీ బ్యూటీ ?
By: Tupaki Desk | 28 Jun 2019 12:18 PM GMTసరిగ్గా వారం రోజుల క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 3 ప్రారంభమైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఫిలిం నగర్ గాసిప్స్ లో ఇప్పుడు తను అందులో నుంచి బయటికి వచ్చేసిందన్న టాక్ బాగా హై లైట్ అవుతోంది. ఆరు నెలల క్రితం కథ చెప్పినప్పుడు ఇప్పుడు సెట్స్ లో అడుగు పెట్టే సమయానికి వినిపించిన ఫైనల్ వెర్షన్ లో చాలా మార్పులు కనిపించాయట. తన పాత్ర లెన్త్ ని తగ్గించడం అప్పుడు చెప్పని అంశాలను జోడించడం లాంటివి జరగడంతో నో చెప్పేసి వచ్చేసిందట.
ఇది నిజమో కాదో నిర్ధారణ కాలేదు కానీ ప్రచారం అయితే జోరుగా ఉంది. రాజు గారి గది రెండు భాగాలూ సక్సెస్ ఫుల్ గా వర్క్ అవుట్ చేసిన ఓంకార్ రెండేళ్లుగా థర్డ్ పార్ట్ కోసం వర్క్ చేస్తున్నాడు. వెంకటేష్ తో చేయాలని ట్రై చేసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ కార్యరూపం దాల్చలేదు. సరే తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా అనుకుంటే ఇప్పుడు ఈ ట్విస్ట్ వచ్చి పడింది అఫీషియల్ గా తమన్నానో ఓంకారో క్లారిటీ ఇస్తే తప్ప నమ్మడానికి లేదు.
గత కొంత కాలంగా హారర్ సినిమాలకు తమన్నా కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అయితే కేవలం రెండు నెలల గ్యాప్ లోనే అభినేత్రి 2-ఖామోష్ రెండూ దారుణమైన డిజాస్టర్లు మిగలడంతో రాజు గారి గది 3 అయినా బ్రేక్ ఇస్తుంది అనుకుంటే ఇప్పడీ టాక్ ఒకటి. తమన్నా చూపు ప్రస్తుతం సైరా విడుదల మీదుంది. చిరంజీవితో మొదటిసారి కలిసి మొదటిసారి నటించడం పట్ల బాగా ఎగ్జైట్ అవుతున్న తమ్ము ఇది కూడా బ్లాక్ బస్టర్ అయితే ఎఫ్2 తర్వాత స్ట్రెయిట్ గా రెండో తెలుగు సక్సెస్ ఖాతాలో పడిపోతుంది