Begin typing your search above and press return to search.

తమిళ దర్శకుడితో తెలుగు హీరోయిన్ పెళ్ళి..?

By:  Tupaki Desk   |   9 Sep 2022 1:30 AM GMT
తమిళ దర్శకుడితో తెలుగు హీరోయిన్ పెళ్ళి..?
X
టాలీవుడ్ హీరోయిన్, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ఓ తమిళ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈషా రెబ్బా.. 'బందిపోటు' 'అమీ తుమీ' 'మాయా మాల్' 'దర్శకుడు' 'సుబ్రహ్మణ్యపురం' 'బ్రాండ్ బాబు' 'అ!' 'అరవింద సమేత వీరరాఘవ' 'రాగల 24 గంటల్లో' వంటి సినిమాల్లో నటించింది.

అందంతో పాటు అభినయం కలబోసిన ఈషా కు ఆశించిన స్థాయిలో క్రేజీ ఆఫర్స్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 'పిట్టకథలు' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. '3 రోజేష్' సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తన హాట్ హాట్ ఫొటో షూట్స్ తో నెట్టింట రచ్చ చేస్తూ వస్తోంది ఈషా. ఈ క్రమంలో తమిళ మలయాళ కన్నడ ఆఫర్లు అందుకుంటున్న తెలుగు అందం.. ఇప్పుడు పక్కన ఇండస్ట్రీలలో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది.

ఈ క్రమంలో ఓ తమిళ్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని.. త్వరలోనే అతడితో ఏడడుగులు వేయబోతుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించారని.. త్వరలో పెళ్లి ఏర్పాట్లు చేయనున్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది.

ఈషా రెబ్బా పెళ్లి ప్రేమాయణం వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే తెలుగమ్మాయి స్పందించే వరకు వేచి చూడాలి. ఇక ఈషా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో ఆ తమిళ దర్శకుడు ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈషా ప్రస్తుతం తమిళ హీరో జీవీ ప్రకాష్ సరసన 'ఆయిరమ్ జెన్మంగల్' అనే చిత్రంలో నటిస్తోంది. అలానే 'ఒట్టు' అనే తమిళ మలయాళ ద్విభాషా చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక కన్నడంలో 'ఎస్సార్కే' అనే సినిమాలో కనిపించనుందని సమాచారం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.