Begin typing your search above and press return to search.
తమన్ కు ఛాన్స్ లు మిస్ అవుతున్నాయా?
By: Tupaki Desk | 27 May 2022 8:30 AM GMTతమన్... టాలీవుడ్ లో స్టార్ హీరో నుంచి డీజే టిల్లు వరకు ఏ హీరోని కదిలించినా తమన్ నామ జపమే చేస్తున్నారు. డబ్బింగ్ ఫిల్మ్ 'వైశాలి'తో తెలుగు మేకర్స్ దృష్టిని ఆకర్షించిన తమన్ ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన 'కిక్' సినిమాతో సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ లో కెరీర్ సూపర్ కిక్కిచ్చే రేంజ్ కి చేరుకున్నాడు. బిగ్ స్టార్స్, క్రేజీ స్టార్స్ మూవీస్ కి సంగీతం అందిస్తూ ఇండస్ట్రీలో తన పేరు మారుమ్రోడగేలా చేసుకున్నాడు. టాలీవుడ్ లో బిగ్ స్టార్ మూవీ గురించి విన్నా తమన్ సంగీతం వినిపిస్తోంది. చిన్న సినిమా నేపథ్య సంగీతం గురించి మాట్లాడినా తమన్ పేరే కనిపిస్తోంది.
అంతలా ఏ చిన్న అవకాశాన్ని కూడా తమన్ వదలడం లేదు. తన వద్ద కు వచ్చి ప్రతీ సినిమాని అంగీకరిస్తూ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డౌరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. తనదైన వర్క్ స్టైల్ కమిట్ మెంట్ తో వర్క్ చేస్తూ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ నే వెనక్కి నెట్టేసి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది తమన్ చేతిలో వున్నవన్నీ స్టార్స్ మూవీసే కావడం గమనార్హం.
తమన్ ఈ ఏడాది దాదాపు ఆరు సినిమాకు సైన్ చేశాడు. అందులో ఇప్పటి వరకు రెండు చిత్రాలు వరుణ్ తేజ్ నటించిన 'గని', సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రాలు విడుదలయ్యాయి.
మరో నాలుగు చిత్రాలు విడుదల కావాల్సి వుంది. విశేషం ఏంటంటే ఇదే ఏడాది తమన్ చిరకాల కోరిక కూడా తీరబోతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా 'బాయ్స్'తో నటుడిగా పరిచయమైన తమన్ ఈ ఏడాది అదే దర్శకుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇది తమన్ కు గ్రేట్ అచీవ్‌మెంట్ అని చెప్పాలి. తమన్ కూడా ఇదే ఫీలవుతున్నాడట. ఇదిలా వుంటే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నా తమన్ కొన్ని క్రేజీ ఆఫర్లని కోల్పోతున్నాడని తెలుస్తోంది. నేపథ్య సంగీతం నుంచి స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే వరకు ప్రతీ అవకాశాన్ని వదలకుండా అంగీకరిస్తూ వస్తున్న తమన్ ని కొంత మంది కావాలనే వద్దనుకుంటున్నారట. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న తమన్ ని తీసుకుంటే అనుకున్న ఔట్ పుట్ ని రాబట్టుకోలేం అని పక్కన పెట్టేస్తున్నారట.
బిజీగా వున్న తమన్ తో వర్క్ చేయించుకోవడం అంత ఈజీ కాదు. పైగా ఈ బిజీ షెడ్యూల్ లో మనం అనుకున్న ఔట్ పుట్ ని తమన్ అందించలేకపోవచ్చు. అలాంటప్పుడ అతన్ని తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని చాలా మంది దర్శకులు లైట్ తీసుకుంటున్నారట. అదే సమయంలో వేరే భాషలకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్లని తీసుకుంటున్నారట. ఇది తమన్ కు బిగ్ లాస్ గా పరిణమిస్తోందని ఇన్ సైడ్ టాక్.