Begin typing your search above and press return to search.

థమన్ హీరో అయ్యే ఆలోచనలో ఉన్నాడా..?

By:  Tupaki Desk   |   5 Nov 2022 9:31 AM GMT
థమన్ హీరో అయ్యే ఆలోచనలో ఉన్నాడా..?
X
మ్యూజిక్ డైరక్టర్ గా ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న థమన్ రీసెంట్ గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. అల వైకుంఠపురములో మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న థమన్ ఆ సినిమాతో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డ్ పొందాడు. ఆ అవార్డ్ థమన్ కి మరింత జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు. అందుకే వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో సూపర్ కాంబినేషన్స్ లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం థమన్ సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబో సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడు సినిమాకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న వారసుడు సినిమా తెలుగు, తమిళ భాషల్లో బలిలింగ్వల్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. శనివారం ప్రోమో వదలగా నేడు ఆ సినిమాలో ఫస్ట్ సింగిల్ సాంగ్ రాబోతుంది.

ఈ ఎనౌన్స్ మెంట్ చేస్తూ థమన్ దళపతి విజయ్ తో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోలో విజయ్ పక్కన థమన్ ని చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. గెడ్డంతో థమన్ స్టైలిష్ లుక్ నెటిజెన్లను ఆకట్టుకుంటుంది.

విజయ్ పక్కన థమన్ కూడా ఒక హీరోలానే ఉన్నాడు. థమన్ ఫోటో కి సూపర్ కామెంట్స్ వస్తున్నాయి. థమన్ నువ్వు కూడా హీరోగా ట్రై చేద్దామనే ఆలోచన ఉందా ఏంటి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు ఫ్యాట్ సోగా ఉన్న థమన్ ఇప్పుడు తన స్లిమ్ లుక్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

థమన్ లో ఈ మార్పుని అతని మ్యూజిక్ లవర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోగా థమన్ అంటూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ కి దారి తీస్తుంది.

శంకర్ డైరక్షన్ లో వచ్చిన బోయ్స్ సినిమాలో థమన్ నటించాడు. సో తెరంగేట్రం ఆల్రెడీ అయ్యింది కాబట్టి థమన్ సినిమాల్లో నటించినా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్న థమన్ మ్యూజిక్ కంపోజింగ్ కే టైక్ సరిపోవట్లేదని చెబుతున్నాడు. అలాంటిది అతను వచ్చి సినిమాల్లో నటిస్తాడా అని అంటున్నారు. మొత్తానికి థమన్ మీద ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.