Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ కుమిలిపోతుందా?
By: Tupaki Desk | 8 Aug 2022 9:29 AM GMTకొన్ని అవకాశాలు కాళ్ల వరకూ వస్తాయి. కానీ వాటిని అంతే వేగంగా తన్నేస్తాం. ఎందుకంటే అవకాశం వెతుక్కుంటూ వస్తే లో కువ. అదే అవకాశం కోసం మనం వెదుక్కుంటే వెళ్తేనే? దాని విలువ తెలుస్తుంది. ఆ తర్వాత రియలైజ్ అవుతాం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అప్పుడిక చేసేదేముంటుంది? వెక్కి వెక్కి ఏడవడం..కుమిలిపోవడం తప్ప.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటిదే. అవును సరిగ్గా ఓ హీరోయిన్ పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. ఇటీవలే ఓ యంగ్ డైరెక్టర్ సక్సెస్ కోసం ఏకంగా స్ర్కిప్ట్ పై నాలుగేళ్లు పనిచేసి ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల రిలీజ్ అయిన సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ సహా ప్రేక్షకుకాభిమానులు మెచ్చిన గొప్ప చిత్రంగా నిలిచింది.
ఓ పరభాషా నటుడ్ని పెట్టుకుని మరి ఇలాంటి క్లాసిక్ హిట్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. కానీ అది సుసాధ్యం చేసి చూపించాడు. ఇప్పుడా దర్శకుడిపై సర్వత్రా ఒకటే ప్రశంసల వర్షం. అందులో నటించిన నటునటులకు వస్తోన్న గుర్తింపు అయితే అసాధారణమని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అంతగా ఏ సినిమాకి పేరు రాలేదు.
సాధారణంగా లవ్ స్టోరీలకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అందుకుంటే గనుక దాని మోత మామూలుగా ఉండదని `అర్జున్ రెడ్డి` తర్వాత మళ్లీ ఆ సినిమా నిరూపించింది. ఇప్పుడీ సినిమా సక్సెస్ ని ..అందులో నటించిన నటీనటులుకు వస్తోన్న గుర్తింపు...పేరు చూసి ఓ హీరోయిన్ తెగ కుమిలిపోతుందిట.
బెడ్ పై పటుకుని వెక్కి వెక్కి ఏడ్చేస్తుందిట. ఏం పాపం? అంతగా ఏ కష్టం వచ్చిందంటారా? అంటే అలాంటి కష్టమే వచ్చింది మరి. ముందుగా ఈ సినిమా లో హీరోయిన్ గా ఆ భామనే ఎంపిక చేసుకోవాలనుకున్నాడు డైరెక్టర్. ఈ నేపథ్యంలో పాత్ర కి సంబంధించి నేరేషన్ ఇవ్వడం జరిగింది. మీరు మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేయగలరని దర్శకుడు గట్టిగానే పట్టుబట్టాడు.
కానీ ఆ హీరోయిన్ కథ విని సింపుల్ గా చేయనని చెప్పేసిందిట. మరి కథ నచ్చి డేట్లు కేటాయించలేక ఆ మాట అందా? లేక పాత్ర నచ్చక చేయనందా? లేదా చిన్న సినిమా అన్న కారణమా? అన్నది తెలియదు గానీ ! ఇప్పుడా హీరోయిన్ మాత్రం తెగ ఫీలైపోతుందిట. ఎందుకు రిజెక్ట్ చేసాను? అని! తెగ వాపోతుందిట.
చివరికి మనసులో బాధను దిగమింగుకోలేక ఆప్త మిత్రకులకు చెప్పుకుని కొంత బాధనైనా దించుకుంటుందిట. ఈ వ్యధ ఓవైపు అయితే మరోవైపు వరుస పరాజయాలు అమ్మడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మూడు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లగా తేలాయి. వరుసగా మూడు సినిమాలు ఫెయిలవ్వడంతో అమ్మడిపై ఐరెన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోయింది.