Begin typing your search above and press return to search.
దిల్ రాజు బ్రాండ్ మరి అంతగా డామేజ్ అయ్యిందా?
By: Tupaki Desk | 3 Aug 2022 6:30 AM GMTఒకే మాటపై నిలబడే వారంటే ప్రతీ ఒక్కరికీ గౌరవం వుంటుంది. కానీ డబుల్ స్టాండ్ తో వ్యవహరించే వాళ్లంటే ప్రతీ ఒక్కరిలోనూ అనుమానం మొదలవుతుంది. అది ఇకొన్ని సార్లు అప్పటి వరకు వున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే కాకుండా మనపై వున్న గుడ్ విల్ ని కూడా దెబ్బతీస్తూ వుంటుంది. ఒక దశలో మన మాట విన్నవారే మన స్టాండ్ ని చూసి హేళన చేస్తూ వుంటారు. సెటైర్లు వేస్తూ వుంటారు. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైందని అంటున్నారు ఇండస్ట్రీ జనం.
సినిమా టికెట్ రేట్ల నుంచి షూటింగ్ ల బంద్ వరకు దిల్ రాజు డబుల్ స్టాండ్ తో వ్యవహరిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో వుండే విధంగా చాల వరకు తగ్గించామని ఇటీవల మీడియా ముఖంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ థియేటర్లలో మాత్రం పరిస్థితి ఆయన మాటలకు పూర్తి భిన్నంగా కనిపించింది. ఇటీవల ఇద్దరు స్టార్ లతో మల్టీస్టారర్ మూవీగా నిర్మించిన ఓ మూవీని రిలీజ్ చేశారు.
రిలీజ్ కు ముందు టికెట్ రేట్లు చాలా వరకు తగ్గించేశాం అన్నారు. కానీ అది జరగలేదు. అదేమని సోషల్ మీడియాలో విమర్శలు ఎదురైతే మాత్రం అది తాను అనలేదని మీడియా తన మాటలని తప్పుగా అర్థం చేసుకుందంటూ ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు. పైగా సినిమాల విషయంలో ఎప్పుడూ ఆయన జడ్జిమెంట్ లెక్క తప్పలేదు.. కానీ ఈ మధ్య తప్పుతోంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి అయినా సినిమా సూపర్ డూపర్ హిట్ అంట స్టేట్ మెంట్ లు ఇస్తూనే వున్నారు.
ఇటీవల ఆయన హిందీలో చేసిన రెండు రీమేక్ సినిమాలు కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ విషయం తనకు ముందే తెలుసునని, సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే ఊహించానని చెప్పడంతో ఇది కాస్తా బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయా సినిమాలకు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించిన బాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజుపై మండిపడ్డారట. దీంతో సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ పై కూడా సెటైర్లు పడుతున్నాయి.
ఇదీ సరిపోదన్నట్టుగా మరో వ్యవహారం దిల్ రాజు బ్రాండ్ ని మరింతగా డ్యామేజ్ చేసింది. ఆగస్టు 1 నుంచి సినిమాల షూటింగ్ ల బంద్ కు ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ కు ముందు నుంచి ప్రధాన భూమిక పోషిస్తూ వస్తున్న దిల్ రాజు తను మాత్రం తన సినిమాల షూటింగ్ ని యధేశ్చగా జరిపిస్తున్నారు.
విజయ్ తో నిర్మిస్తున్న 'వారసుడు' షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఇదేమంటే ఇది తమిళ సినిమా. మనం ఆపాలనుకుంది తెలుగు సినిమాల షూటింగ్ తమిళ సినిమాల షూటింగ్ కాదంటూ లాజిక్ లు చెప్పడంతో దిల్ రాజు బ్రాండ్ ఇమేజ్ మరింతగా డ్యామేజీ అవుతోంది. దిల్ రాజు వ్యవహారం గమనించిన వాళ్లంతా నాది కాకపోతే ఎంత దాకైనా డేకుతానన్నాడట అన్నట్టుగా వుందని మండిపడుతున్నారట.