Begin typing your search above and press return to search.

మ‌న్సూర్ అలీఖాన్ ఆరోగ్యంపై ఆ ప్ర‌చారం నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   11 May 2021 5:30 AM GMT
మ‌న్సూర్ అలీఖాన్ ఆరోగ్యంపై ఆ ప్ర‌చారం నిజ‌మేనా?
X
క‌రోనా వైర‌స్ ఉధృతి నేప‌థ్యంలో ఆసుప‌త్రి అంటేనే బెంబేలెత్తిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. సాధార‌ణ జ్వ‌రం వ‌చ్చినా కొవిడ్-19 అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రోగం ఏదైనా క‌రోనా భ‌యంతో కంటికి కునుకు ప‌ట్ట‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ అనారోగ్యంతో ఆసుప‌త్రి పాలైన‌ట్లుగా కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆసుప‌త్రి ఐసీయూలో ఉన్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదుగానీ ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌పడుతూ మ‌న్యూర్ ఆసుప‌త్రిలో చేరార‌ని తెలుస్తోంది. కొంద‌రు క‌రోనా తో ఇబ్బంది ప‌డుతున్నార‌నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వ‌మెంత‌? ఆయ‌న అస‌లు ఐసీయూలో ఉన్నారా? నిజంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? లేక సాధార‌ణ జ్వ‌రానికే ఇలాంటి ప్ర‌చార‌మా? అన్న‌ది తేల‌డం లేదు.

ఇటీవ‌లే త‌మిళ న‌టుడు వివేక్ గుండెపోటుతో మ‌ర‌ణించిన నేప‌థ్యంలో మ‌న్సూర్ అలీఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వ్యాక్సినేష‌న్ పాల‌సీనే ఆయ‌న వ్య‌తిరేకించారు. ప్ర‌భుత్వాల తీరును ఆయ‌న ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేసారు. వివేక్ మ‌ర‌ణానికి కార‌ణం ప్ర‌భుత్వాలేన‌ని వ్యాక్సినేష‌న్ స‌రిగా చేయ‌క విక‌టించి వివేక్ మ‌ర‌ణించారని ఆరోపించారు. వ్యాక్సినేష‌న్ కు తాను వ్య‌తిరేక‌మ‌ని కూడా వాదించారు.

మ‌న్సూర్ అలీఖాన్ వృత్తిగ‌త విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఏడాదిన్నర‌ కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. క‌రోనా నేప‌థ్యంలోనే షూటింగ్ ల‌కు దూరంగా ఉండాల‌ని వ‌చ్చిన అవ‌కాశాల్ని వ‌దులుకున్న‌ట్లు కొలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. కెప్టెన్ ప్ర‌భాక‌ర్ అనే చిత్రంలో క్రూరుడైన తీవ్ర‌వాదిగా మ‌న్సూర్ న‌ట‌న‌ను తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేరు. న‌టుడిగా ద‌శాబ్ధాల పాటు కొన‌సాగుతున్నారు.