Begin typing your search above and press return to search.
ఫ్యామిలీమ్యాన్ 2కు అలాంటి పరిస్థితా? అలా యాడ్ ఇచ్చుకోవటమా?
By: Tupaki Desk | 24 May 2021 4:30 AM GMTఓటీటీ ఫ్లాట్ ఫాం మీద వచ్చే సిరీస్ లు అన్ని ఇన్ని కావు. కానీ.. విశేష ఆదరణతో పాటు.. కచ్ఛితంగా చూడాలన్న భావనకు గురి చేసిన సిరీస్ ల్లో ఒకటి ఫ్యామిలీ మ్యాన్. మొదటి సిరీస్ కు కొనసాగింపుగా రెండో సిరీస్ వచ్చే నెల విడుదల కానుంది. దీని కోసం ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ మే 19న విడుదల కావటం.. తక్కువ వ్యవధిలో 37 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇదంతా ఒక లెక్క అయితే.. ఈ రెండు నిమిషాలకు పైనే ఉన్న ట్రైలర్ ఈ సిరీస్ మీద కొత్త వివాదాల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొంది. తమిళుల మనోభావాలు దెబ్బ తినేలా ఇందులోని కంటెంట్ ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన సమంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతున్నారు. అందులోని ఆమె క్యారెక్టర్ ను తిట్టిపోస్తున్నారు.
తమిళురాలిగా నటించిన సమంత ఒరిజనల్ గా కూడా తమిళియన్ కావటం.. తమిళుల మనోభావాల్ని దెబ్బ తీసే నెగిటివ్ రోల్ లో ఆమె నటించటాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి వేళ.. ఫ్యామిలీ మ్యాన్ టీం ఒక ఇంటర్వ్యూను విడుదల చేసింది. అది కూడా యాడ్ రూపంలో కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన కంటెంట్ తో పోలిస్తే.. సినిమా కంటెంట్.. అందునా ఫ్యామిలీ మ్యాన్ లాంటి మోస్ట్ అవేటింగ్ సిరీస్ గురించి ఇంటర్వ్యూలు ఇస్తామంటే.. పోలోమని పరుగులు తీసే మీడియా సంస్థలు అన్ని ఇన్ని కావు.
అందుకు భిన్నంగా.. తాము చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. సిరీస్ విడుదలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేలా ప్రశ్నలు.. సమాధానాల్ని తయారు చేసి దాన్ని ప్రకటన రూపంలో డిజిటల్ మీడియాలో విడుదల చేసిన వైనం చూస్తే.. సమంత పాత్రపైనా.. తమిళుల మనోభావాల్ని తీసేలా సిరీస్ ఉంటుందన్న ట్రోలింగ్ విషయంలో భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. సిరీస్ కు అన్ని తామైన రాజ్ డీకేలు సమాధానాల్ని ఇవ్వటం గమనార్హం.
ప్రకటన (యాడ్) రూపంలో ఉన్న ఈ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్.. దానికి సమాధానం చూస్తే.. ఫ్యామిలీ మ్యాన్ 2 టీం భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రటకనలో ఇచ్చిన ప్రశ్న.. సమాధానం యథాతధంగా చూస్తే..
ప్రశ్న: ట్రైలర్ చూసి కొందరు విమర్శిస్తున్నారు. రాజీ పాత్ర పోషించిన సమంత పాత్ర తమ మనోభావాల్ని గాయపరిచిందని అంటున్నారు?
రాజ్ - డీకే: ట్రైలర్ లోని కొన్నిషాట్స్ చూసి.. కథను అంచనా వేయటం తప్పు. ఈ సిరీస్ లోని ప్రధాన తారాగణంతో పాటు రచనా బ్రందంలో అత్యధికులు తమిళులు. వారి ప్రజల మనోభావాలు.. వారి కల్చర్ పట్ల మాకు అవగామన ఉంది. అంతకు మించి తమిళ ప్రజల పట్ల మాకు అపూర్వమైన ప్రేమ.. గౌరవం ఉంది. సీజన్ 1లో ఎలా అయితే సున్నితమైన.. భావోద్వేగపూరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామో.. అదే విధంగా ఈ సీజన్ కోసం కష్టపడ్డాం. ఈ షో చూశాక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు.