Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ 30 మొదలయ్యేది అప్పుడేనా?
By: Tupaki Desk | 11 Dec 2022 10:30 AM GMTజక్కన్న అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన విజువల్ ఎక్స్ట్రాగవాంజా 'RRR'. ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేపథ్యంలో సాగే ఫిక్షనల్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటించగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం నటించిన విషయం తెలిసిందే. 'RRR' కు చరణ్ ని మించి ప్రధాన ఆయువు పట్టుగా నిలచిన ఎన్టీఆర్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ తో గూస్ బంప్స్ తెప్పించాడు.
తనదైన మార్కు రొమాంచిత యాక్షన్ ఘట్టాలతో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఈ మూవీలో నటించిన కొమురం భీం పాత్రతో వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్ లతో పాటు స్టార్లని, విదేశీ సినీ ప్రియుల్ని సైతం విశేషంగా ఆకట్టుకుని వారి ప్రశంసలు దక్కించుకున్న ఎన్టీఆర్ ఈ పాన్ ఇండియా వండర్ తరువాత తన 30వ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు కావస్తున్నా ఇంత వరకు ముందుకు కదలడం లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసినట్టుగా దర్శకుడు కొరటాల శివ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ లతో చర్చిస్తున్న ఫొటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసినట్టుగా వెల్లడించింది.
అయితే ఎప్పుడు సినిమా పట్టాలెక్కేది మాత్రం ఇంత వరకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజా ఓ అప్ డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వున్న ఈ మూవీని జనవరి మిడ్ లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా స్టోరీగా ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది.
కరోనా టైమ్ లో సామాన్యుడు చేసిన హామా కారాలు.. అదునుగా భావించిన మెడికల్ మాఫియా చేసిన మారహోమం నేపథ్యంలో ఈ మూవీ వుంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ఈ మూవీలో స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని, పాలిటిక్స్ లో చురుగ్గా వుండే స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ ఈ సినిమాలో అత్యంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.