Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచేది అప్పుడేనా..?

By:  Tupaki Desk   |   7 Jun 2021 7:31 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచేది అప్పుడేనా..?
X
కరోనా వైరస్ కారణంగా సినీ ఇండస్ట్రీ కూడా బాగా నష్టపోయింది. సినిమా షూటింగులు నిలిచిపోయి.. థియేటర్లు మూతపడి చిత్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టబడింది. అయితే ఫస్ట్ వేవ్ సమయంలో మన టాలీవుడ్ అందరి కంటే ముందుగానే తెరుకుందని చెప్పవచ్చు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం నుంచి కూడా బయటపడటానికి టాలీవుడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో ఈరోజు సోమవారం నుంచి షూటింగ్స్ చేసుకోడానికి అనుమతులు ఇవ్వడంతో.. ఇక్కడ కూడా షూటింగ్ లు ప్రారంభించే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండటంతో జూలై ఫస్ట్ వీక్ నుంచి థియేటర్లు ఓపెన్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే థియేటర్లు తెరుచుకున్నా పూర్తి స్థాయిలోనే సీటింగ్ ఆక్యుపెన్సీకి అవకాశం ఉండకపోవచ్చు. గతేడాది మాదిరిగానే ముందుగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకుంటాయని అందరూ భావిస్తున్నారు. యాభై శాతంతో థియేటర్లు రీ ఓపెన్ చేసినా సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే చిన్న మీడియం సినిమాలన్నీ స్క్రీన్ మీదకు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ చేసి వాయిదా పడిన చిత్రాలన్నీ రీ షెడ్యూల్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. జూలై లో రిలీజ్ అయ్యే చిన్న సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ని చూసి.. మీడియం చిత్రాలు క్యూ కట్టనున్నాయి. అంటే ఆగస్ట్ - సెప్టెంబర్ నెలల్లో 'లవ్ స్టోరీ' 'విరాటపర్వం' 'టక్ జగదీష్' 'రిపబ్లిక్' 'పాగల్' 'లక్ష్య' లాంటి క్రేజీ ప్రాజెక్టులు విడుదలయ్యే అవకాశం ఉంది.