Begin typing your search above and press return to search.
`అఖండ`ని అందుకే ప్రమోట్ చేయలేదా?
By: Tupaki Desk | 2 Dec 2021 6:09 AM GMTసినిమాలకిప్పుడు ప్రమోషన్ అనేది అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ అయినా సరే మడియా ముందుకొచ్చి ప్రమోట్ చేయాల్సిందే. ఆ దిశగానే చాలా మంది హీరోలు ముందుకు సాగుతున్నారు. దొరికిన ఏ మీడియాని విడిచిపెట్టడం లేదు. కాసేపు మెయిన్ స్ట్రీమ్ మీడియాని పక్కనబెడితే సోషల్ మీడియాలో మాత్రం కచ్చితంగా గట్టి ప్రచారమే నిర్వహించాలి. కానీ నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన `అఖండ` విషయంలో మాత్రం అది ఎక్కడా కనిపించలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ పెద్దగా ప్రచారం చేయలేదని తెలుస్తోంది.
ఇప్పటివరకూ ప్రతీ సినిమా రిలీజ్ విషయంలో బాలయ్య ప్రచారం లో చురుగ్గానే పాల్గొనేవారు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అంతే ఉత్సాహం చూపించే వారు. కానీ `అఖండ` విషయంలో అంతా రివర్స్ లో కనిపిస్తుంది. కేవలం ప్రీరిలీజ్ ఈవెంట్ మినహా ఇంకెక్కడా సినిమాని ప్రమోట్ చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్...హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ సినిమా ప్రచారాన్ని కాస్తాకూస్తో నెత్తిన వేసుకున్నారు. మరెందుకు ఇలా జరుగుతుందంటే? ఆసక్తికర సంగతులే బయటకు వస్తున్నాయి.
ఏపీలో ఇటీవలే టిక్కెట్ ధరలపై జీవో రిలీజ్ అయిన సంగతి తెలసిందే. అలాగే తెలంగాణలోనూ టిక్కెట్ ధరలు ప్రభుత్వం తగ్గించినా..హైకోర్టు పెంచుకోమని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ బాలయ్య ..బోయపాటి ప్రచారంలో పాల్గొంటే ఈ సమస్యల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. బాలకృష్ణ హిందుపురం ఎమ్మెల్యే గా కూడా ఉన్నారు కాబట్టి ..అదీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి కచ్చితంగా మాట్లాడాలి. ఇప్పటికే పరిశ్రమ తరుపును పవన్ కల్యాణ్.. చిరంజీవి..సురేష్ బాబు సహా కొంత మంది పెద్దలు స్పందించారు. కానీ బాలయ్య మాత్రం తూతూ మంత్రంగానే స్పందించారు. వకీల్ సాబ్ ఘటనలు పునరావృతం అవుతాయనే ఆయన అలా చేశారా? అన్నది కూడా ఇక్కడ ఒక సందేహం. `ఆహా 2.0` అన్ స్టాపబుల్ షోకి బాలయ్య హాస్ట్ గా వ్యవహరిస్తోన్న అఖండ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడకపోవడం గమనార్హం.