Begin typing your search above and press return to search.
'ఆది పురుష్' టీమ్ తప్పుల మీద తప్పులు చేస్తోందా?
By: Tupaki Desk | 29 Oct 2022 12:30 AM GMTపురాణాలని, ఇతిహాసాలని తెరపైకి తీసుకురావాలంటే ప్రస్తుత కాలంలో అది కేవలం దక్షిణాది వారి వళ్లనే అవుతుందని బాలీవుడ్ మేకర్స్ నిరూపిస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం ఉత్తరాదికి చెందిన రామానంద సాగర్ రూపొందించిన `రామాయణ` దేశ వ్యాప్తంగా అన్ని భాషలకు చెందిన వారిని విశేషంగా ఆకట్టుకుంది. రామానందసాగర్ కు పద్మ పురస్కారం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం ప్రేక్షకులు వీక్షించిన తొలి మైథలాజికల్ సీరనియల్‌గా వరల్డ్ రికార్డ్ సాధించింది.
ఇక వ్యాస మహాముని విరచిత మహాభారతాన్ని `మహాభారత్` పేరుతో మెగా సీరియల్ గా బి.ఆర్ చోప్రా రూపొందించారు. 94 ఎపిసోడ్ లుగా సాగిన ఈ సీరియల్ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టెలివిజన్ చరిత్రలోనే అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న మెగా సీరియల్ గా రికార్డుని సాధించింది. వీటి తరువాత ఎన్ని సీరియల్స్, సినిమాలు వచ్చినా `రామయణ్`ని కానీ, `మహాభారత్`ని కానీ మరిపించలేకపోయాయి.
మళ్లీ ఇన్నాళ్లకు రామాయణ గాధ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా `ఆది పురుష్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ డ్రామా కావడంతో ఈ మూవీపై అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ తొలి సారి శ్రీరాముడిగా నటిస్తున్న సినిమా కావడంతో తనని ఎలా చూపించబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే ఆ అంచనాల్ని రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఒక్కసారిగా తలకిందులు చేసింది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం సరిపోని స్థాయిలో సినిమా వుంటుందని టీజర్ క్లారిటీ ఇవ్వడంతో మేకర్స్ పై విమర్శల వెల్లువ మొదలైంది.
ప్రభాస్ ని రాముడిగా చూపించిన తీరు, హనుమంతుడి పాత్ర, లక్ష్మణుడు, రావణుడిగా సైఫ్ అలీఖాన్ మేకోవర్ ప్రేక్షకుల్ని షాక్ కు గురిచేసింది. మనం చూస్తున్నది రామాయణం నేపథ్యంలో రూపొందుతున్న `ఆదిపురుష్`టీజర్ నా లేక మరేదైననా? అని ప్రేక్షకులు, విమర్శకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సినిమాని 3డీ, ఐమాక్స్ ఫార్మాట్ లలో రూపొందిస్తున్నామని మేకర్స్ వెల్లడించినా ఎక్కడా `ఆదిపురుష్`టీజర్ లో రామాయణ ఛాయలు కనిపించకపోవడంతో ప్రేక్షకులు, విమర్శకులు మేకర్స్ పై దుమ్మెత్తిపోశారు.
తాజా విమర్శల నేపథ్యంలో `ఆదిపురుష్` మరో బ్లండర్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ తో అసహనాన్ని వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ మరో షాక్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే ఈ మూవీ నిడివిని అని తెలుస్తోంది. `ఆదిపురుష్` రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలని తెలిసింది. టీజర్ తో భయపెట్టిన టీమ్ నిడివి విషయంలోనూ ప్రేక్షకుల్ని భయపెట్టడబోతోందని తెలుస్తోంది. ఇది నిజంగా `ఆదిపురుష్`కు పెద్ద డ్రా బ్యాక్ గా మారడం ఖాయం అని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.