Begin typing your search above and press return to search.

డార్లింగ్ విల్లా ప్రాజెక్టు మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   11 Dec 2021 8:05 PM IST
డార్లింగ్ విల్లా ప్రాజెక్టు మామూలుగా లేదుగా?
X
రెబల్ స్టార్ వారసుడిగా..యంగ్ రెబల్ స్టార్ కంటే కూడా ‘డార్లింగ్’ గా సుపరిచితుడు ప్రభాస్. టాలీవుడ్ లోని మిగిలిన హీరోలకు భిన్నమైన ఇమేజ్ అతడి సొంతం. బాహుబలి తర్వాత అతడి రేంజ్ ఎంత భారీగా పెరిగిపోయిందో తెలిసిందే. ఏహీరో కూడా బాహుబలి లాంటి సవాల్ ను స్వీకరించేందుకు కాస్త భయపడతారు. అలాంటిది ఒక సినిమాను నమ్ముకొని ఏళ్లకు ఏళ్లు శ్రమించినదానికి ఫలితం దక్కటమే కాదు.. ఈ మూవీతో ఆయనో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న రాధే శ్యామ్.. సలార్.. ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే.. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ మూవీల్ని చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యేలా ఆయన షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్నారు.

సినిమాల పరంగా టాప్ రేంజ్ లో ఉన్న ప్రభాస్ కు సంబంధించిన పర్సనల్ విషయం ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ సినీ విలేజీలో ఒక భారీ విల్లాను కట్టిస్తున్నారని చెబుతున్నారు. ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరగా ఉండే ఈ విల్లాకు ఆయన దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే రూ.120 కోట్లతో రెండు ఎకరాల స్థలాన్ని కొన్న ప్రభాస్.. మరోరూ.80 కోట్లతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ ను నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఈ భారీ బడ్జెట్ ను చూస్తే.. ఇంతటి ఖరీదైన ఇల్లు ఉన్న సినీ ప్రముఖులు అతి కొద్ది మాత్రమే ఉన్నారు.

ఇప్పటికే ప్రభాస్ కు జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు ఉంది. ఇక్కడకు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరానికికాస్త దూరంగా.. ప్రశాంత వాతావరణంలో.. ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండేలా ఇంటిని ప్లాన్ చేసినట్లు చెబుతారు. అందుకే.. డార్లింగ్ కోరుకున్న వాటికి దగ్గరగా తాజా విల్లా ప్రాజెక్టు ఉందని చెబుతున్నారు.