Begin typing your search above and press return to search.
నిర్మాతల నిర్ణయం దర్శకులను ఒత్తిడిలోకి నెట్టేస్తోందా..?
By: Tupaki Desk | 3 Feb 2021 1:30 AM GMTగత వారం రోజులుగా సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ -టీజర్-ట్రైలర్స్-రిలీజ్ డేట్స్ అంటూ టాలీవుడ్ లో వరుసపెట్టి అనౌన్స్ మెంట్స్ ఇస్తున్నారు. వచ్చే వారం మొదలుకొని వచ్చే ఏడాది సంక్రాంతి వరకు విడుదలయ్యే సినిమాల తేదీలను ప్రకటించారు. అందులో ఆల్రెడీ కంప్లీట్ అయిన సినిమాలు.. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు.. ఇంకా సెట్స్ పైకి వెళ్లని సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా వరుసగా సినిమా అప్డేట్స్ వస్తుండటంతో ఏడాదిగా సినీ వినోదానికి దూరమైన సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఇది దర్శకులపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో తక్కువ రోజుల్లో సినిమాలు పూర్తి చేసే దర్శకులు ఉన్నారు.. ఒక సినిమా చేయడానికి సంవత్సరాలు టైం తీసుకునే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో వారిపై ఒత్తిడి కలుగుతోందని తెలుస్తోంది. ప్రొడ్యూసర్స్ కి మనీ సేవ్ చేస్తూనే అనుకున్న సమయానికి క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రెజర్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇలా ప్రీ ప్లాన్ గా ఉండటానికి ఓటీటీ కల్చర్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ముందుగానే రిలీజ్ డేట్ లాక్ చేసి పెట్టుకోవడం అనేది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇండియన్ సినిమాలో టాలీవుడ్ కూడా ఆధిపత్యం చేలాయించే పరిస్థితులు వచ్చాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఫిలిం మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.