Begin typing your search above and press return to search.
దిపావళి సమరం ఆ ఇద్దరి మధ్యేనా?
By: Tupaki Desk | 17 Oct 2022 4:10 PM GMTఈ దసరాకు మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'తో, కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్'తో ప్రేక్షకుల ముందుకు రాగా వీరితో పాటే చిన్న హీరో బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' మూవీతో పోటీపడ్డాడు. ఈ మూడు సినిమాలతో దసరా హంగామా ముగిసింది. ఇప్పడు దివాళీ సమరం ఆరంభం కాబోతోంది. దసరా సినిమాల తరువాత 'కాంతారా' వంటి కన్నడ సినిమాతో పాటు టాలీవుడ్ కు సంబంధించిన చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఈ సారి దీపావళికి మాత్రం రెండు స్ట్రెయిట్ సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
విచిత్రం ఏంటంటే ఈ దీపావళి బరిలో మాత్రం ఓ స్ట్రెయిట్ సినిమా. ఓ డబ్బింగ్ సినిమా హాట్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇక మిగిలిన స్ట్రెయిట్ సినిమా... ఓ డబ్బింగ్ సినిమా కు బాక్సాఫీస్ వద్ద పెద్దగా బజ్ లేదు. దీపావళి బరిలో మొత్తం నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. కానీ ప్రధాన పోటీ మాత్రం విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన 'ఓరి దేవుడా!'. కార్తి హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ మూవీ 'సర్దార్' మధ్యే పోటీ వుండే అవకాశం కనిపిస్తోంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా!' మూవీలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్ లుగా నటించారు. అయితే ఎప్పుడైతే గెస్ట్ గా దేవుడి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడని రివీల్ చేశారో అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాపై మరింత బజ్ మొదలైంది. ఈ మూవీని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు.
అదే రోజున కార్తి ద్విపాత్రాభినయం చేసిన 'సర్దార్' రిలీజ్ అవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని పీ.ఎస్ మిత్రన్ తెరకెక్కించాడు. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీతో ఒకనాటి హీరోయిన్ లైలా మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తోంది.
సీబీఐ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కార్తికి సోదరిగా కనిపించబోతోంది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. చాలా రోజుల తరువాత కార్తి డ్యుయెల్ రోల్ లో రా ఏజెంట్ గా రెండు భిన్నమైన పాత్రల్లో నటించిన సినిమా కావడం, ఈ మూవీని కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీ ఇప్పడు వార్తల్లో నిలుస్తోంది.
ఈ రెండు సినిమాలతో పాటు మంచు విష్ణు నటించిన 'జిన్నా', తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన 'ప్రిన్స్ ' రిలీజ్ ఆకనున్నాయి. మంచు విష్ణు సినిమా 'జిన్నా' గురించి పట్టించుకునే వారే లేరు.. ఇక 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కె.వి డైరెక్ట్ చేసిన సినిమా కావడం, హీరో శివ కార్తికేయన్ నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించడంతో 'ప్రిన్స్' మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతుందని అనుకున్నారు. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా చిత్ర బృందం సినిమాని పెద్దగా ప్రమోట్ చేయాలని ఆసక్తిని చూపించకపోవడంతో ఈ సినిమా ఇంతకీ దీపావళి బరిలో రిలీజ్ అవుతుందా? అన్నది ఇప్పటుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.