Begin typing your search above and press return to search.

హీరో మృతికి హీరోయినే కార‌ణమా?

By:  Tupaki Desk   |   13 July 2022 10:30 AM GMT
హీరో మృతికి హీరోయినే కార‌ణమా?
X
బాలీవుడ్ హీరోయిన్, దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. యావ‌త్ ప్ర‌పంచం క‌రోరా కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వేళ 2020లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హ‌త్య చేసుకున్నాడ‌న్న వార్త దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లాన్ని సృష్టించింది. డ్ర‌గ్స్ కార‌ణంగానే సుశాంత్ ఆత్మ హ‌త్య చేసుకున్నాడ‌ని, దీని వెన‌క న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి హ‌స్తం వుంద‌ని తాజాగా నేష‌న‌ల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎస్సీబీ) తాజాగా రియాపై చార్జీషీట్ ని దాఖ‌లు చేసింది.

ఇందులో రియాతో పాటు 34 మంది నిందితుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాకుండా హై సొసైటీకి సంబంధించిన బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు వీరంతా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కేసులో ఆయ‌న ప్రియురాలు, న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ కొనుగోలు చేసి సుశాంత్ కు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తూ తాజాగా నేష‌న‌ల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తాజాగా చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డం ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారింది. అంతే కాకుండా రియా డ్ర‌గ్స్ కొనుగోలు చేసి సుశాంత్ కు ఇవ్వ‌డం వ‌ల్లే అత‌ను ఈ అల‌వాటుకు మానిస‌య్యాడ‌ని, సుశాంత్ మ‌ర‌ణానికి రియా ఇచ్చిన డ్ర‌గ్సే కార‌ణ‌మ‌ని ఎన్ సీబీ త‌మ చార్జిషీట్ లో వెల్ల‌డించింది.

రియా, ఆమె సోద‌రుడు సోవిక్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఆమె ఎవ‌రెవ‌రి ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్ సీబీ నిందుతులు పేర్కొన్నారు. ఇక కోర్టులో ఎన్ సీబీ చార్జిషీట్ లో చేసిన అభియోగాలు రుజువైతే మాద‌క ద్ర‌వ్యాల నిరోధ‌క‌చ‌ట్టం కింద రియాకు ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఎన్ సీబీ త‌మ చార్జిషీట్ లో రియా, ఆమె సోద‌రుడితో పాటు ఇత‌ర నిందితులంతా మార్చి 2020 నుంచి డిసెంబ‌ర్ 202 మ‌ధ్య బాలీవుడ్ లో డ్ర‌గ్స్ పంపిణీ చేయ‌డానికి, విక్ర‌యించేందుకు ఒక గ్రూప్ గా ఏర్ప‌డి డ్ర‌గ్స్ స‌ప్లై చేశార‌ట‌.

నిందులు ముంబై మెట్రో పాలిట‌న్ ప్రాంతంలో మాదక ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణాకు ఆర్థిక స‌హాయం చేశార‌ని, గంజాయి, చ‌ర‌స్‌, కొకైన్ తో పాటు ఇత‌ర మాద‌వ‌క ద్ర‌వ్యాలు సైకోట్రోపిక్ ప‌దార్థాల‌ను ఉప‌యోగించార‌ని ఎన్ సీబీ పేర్కొంది.

రియా సోద‌రుడు సోవిక్ చ‌క్ర‌వ‌ర్తి మాద‌క ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేసే ముఠాతో త‌ర‌చూ సంప్ర‌దింపులు చేశాడ‌ని తెలిపింది. అంతే కాకుండా చ‌ర‌స్ ఆర్డ‌ర్ చేసి అనంత‌రం ఇత‌ర నిందితుల నుంచి దాన్ని పొందేవాడ‌ని పేర్కొన్నారు. ఎన్ డీపీఎస్ చ‌ట్టానికి సంబంధించిన కేసుల‌ను విచారిస్తున్న ప‌ర‌త్యేక న్యాయ‌మూర్తి విజి ర‌ఘువంశీ ఈ కేసు విచార‌ణ‌ను జూలై 27కు వాయిదా వేశారు.

కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబ‌ర్ లో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత నెల రోజుల‌కు ఆమె బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఈ కేసుపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తూనే వున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక రియా చ‌క్ర‌వ‌ర్తి వుందంటూ సుశాంత్ ఫ్యామిలీ బ‌లంగా వాదిస్తూ వ‌స్తోంది. తాజాగా ఎన్సీబీ దాఖ‌లు చేసిన చార్జిషీట్ లో ఇది నిజ‌మ‌ని మ‌రోసారి స్ప‌ష్టం కావండంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య మరోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.