Begin typing your search above and press return to search.

జేడీ మ‌ళ్లీ బిజీ అవుతున్నాడా?

By:  Tupaki Desk   |   16 April 2022 9:30 AM GMT
జేడీ మ‌ళ్లీ బిజీ అవుతున్నాడా?
X
రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ట్రెండ్ సెట్ట‌ర్ 'శివ‌' చిత్రంతో జెడీ చ‌క్ర‌వ‌ర్తి సీని జ‌ర్నీ మొద‌లైంది. ఇందులో స్టూడెంట్ గా క‌నిపించిన జేడీ అదే పేరుని త‌న ఇంటి పేరుగా మార్చుకుని న‌టుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. న‌టుడిగా, విల‌న్ గా, హీరోగా ప‌లు విభిన్న‌మైన చిత్రాల‌తో త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. జెడీ హీరోగా న‌టించిన తొలి బాలీవుడ్ మూవీ 'స‌త్య‌' తెలుగు, హిందీ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

జేడీ పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 16). ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌నీ, వ‌న్ బై టు, అన‌గ‌న‌గ ఒక రోజు, గులాబీ, 'స‌త్య‌', బొంబాయి ప్రియుడు, ఎగిరే పావుర‌మా, ప్రేమ‌కు వేళాయెరా, రీసెంట్ గా 'ఎంఎంఓఎఫ్‌' వంటి చిత్రాల్లో హీరోగా న‌టించి ఆక‌ట్టుకున్నారు.

ద‌ర్శ‌కుడిగా కూడా త‌న మార్కుని చూపించే ప్ర‌య‌త్నం చేశారు. హిందీలో దుర్గ‌, ద‌ర్వాజ బంద్ ర‌క్కో, తెలుగులో హోమం, సిద్ధం, మ‌నీ మ‌నీ మోర్ మ‌నీ, ఆల్ ద బెస్ట్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గ‌త కొంత కాలంగా ఇండ‌స్ట్రీలో క్రేజీ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న జేడీ చ‌క్క‌వ‌ర్తి ప్ర‌స్తుతం హిందీలో 'ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ , క‌న్న‌డ‌లో ఒప్పంద, ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా, ద‌హిని వంటి చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇవే కాకుండా ఓ థ్రిల్ల‌ర్ లోనూ న‌టిస్తున్నారు.

ఒళ్లు గ‌గుర్పొడిచే థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్‌, ప్రైమ్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక త‌మిళంలో సింగం ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న 'క‌ర్రీ'లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో శ‌శి కుమార్ హీరో. అలాగే 'ప‌ట్ట‌రాయ్‌' అనే మ‌రో త‌మిళ చిత్రంలోనూ న‌టిస్తున్నారు.

క‌న్న‌డ‌లో యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో క‌లిసి 'ఒప్పంద‌', ప్రేమ్‌, డ‌బ్ల్యూ హెచ్ ఓ చిత్రాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జెడీ చ‌క్ర‌వ‌ర్తి మ‌ళ్లీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ మెయిన్ ట్రాక్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. గ‌త కొంత కాలంగా మెయిన్ స్ట్రీమ్ చిత్రాల‌కు దూరంగా వుంటూ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తున్న జేడీ మళ్లీ బిజీ కావ‌డం ఖాయం అని చెబుతున్నారు.