Begin typing your search above and press return to search.
లవర్ బాయ్ మార్కెట్ అంత డౌన్ అయిందా?
By: Tupaki Desk | 15 Nov 2019 10:24 AM GMTయువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో మహా జోరుగా ఉండేది. వరస హిట్లతో ఒక దశలో సెకండ్ లీగ్ హీరోలలో చేరతాడని అనుకున్నారు. కానీ ఈమధ్య వరస ఫ్లాపులతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ డీలా పడ్డాడు. రాజ్ తరుణ్ ఫ్లాపుల ఎఫెక్ట్ కొత్త సినిమాపై పడుతోందనే టాక్ ఉంది. రాజ్ తరుణ్ కొత్త సినిమాకు మహా అయితే రెండు వందల స్క్రీన్లు దొరకడం గొప్ప అన్నట్టుగా ఉందట పరిస్థితి.
ఎవరు ఎన్ని చెప్పినా థియేటర్ల సంఖ్య అనేది సినిమాకు ఉండే డిమాండ్ పైనే ఆధారపడి ఉంటుంది. పెద్ద స్టార్ హీరోల సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. మొదటి వీకెండ్ లోనే సగానికి పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తారు. కానీ కొత్త హీరోలు.. మీడియం రేంజ్ హీరోల పరిస్థితి అలా ఉండదు. డిమాండ్ లేకపోయినా ఎక్కువ స్క్రీన్లలో కనుక బలవంతగా రిలీజ్ చేస్తే రివర్స్ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. 'థియేటర్లు ఖాళీగా ఉన్నాయి' అనే మెసేజ్ కనుక బైటకు వస్తే నెగెటివ్ టాక్ జోరుగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే డిమాండ్ లేని సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ లో లో రిలీజ్ చెయ్యడం సేఫ్ కాదు. మరో కారణం ఏంటంటే ఫ్లాపులలో ఉన్న హీరోకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోందట.
గతంలో రాజ్ తరుణ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేదని.. పెద్ద సంఖ్యలో స్క్రీన్స్ ఇచ్చేవారని.. వరస ఫ్లాపులతో డిమాండ్ తగ్గిపోవడంతో తక్కువ థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందననే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే రాజ్ తరుణ్ తప్పనిసరిగా ఓ మంచి హిట్ సాధించాల్సిందే. లేకపోతే పరిస్థితి మరింతగా దిగజారే ఛాన్స్ ఉందని అంటున్నారు.