Begin typing your search above and press return to search.
పుష్ప మలయాళ వెర్షన్ నో రిలీజ్!
By: Tupaki Desk | 17 Dec 2021 5:30 AM GMTపుష్ప - ది రైజ్ నేడు (17డిసెంబర్) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు విడుదలకు అన్నివిధాలా క్లియరెన్స్ ఉంది. అయితే హిందీ రిలీజ్ ఆలస్యమవుతుందని ఇంతకుముందు గుసగుసలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో సమస్యను పరిష్కరించారని తెలిసింది.
అమెరికాలోనూ కొన్ని ప్రీమియర్లు రద్దయ్యేందుకు ఆస్కారం ఉందన్న ప్రచారం సాగింది. కానీ యథాతథంగా పుష్ప ప్రీమియర్లతో ఈరోజు విడుదలైంది. షోల రద్దు ప్రచారాన్ని అమెరికా పంపిణీ వర్గాలు ఖండించిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ ప్రీమియర్ ల గురించి పుకార్ల నేపథ్యంలో క్యూబ్ కంటెంట్ ను డౌన్ లోడ్ చేసే షెడ్యూల్ ప్రకారం ప్రీమియర్ లను ప్రారంభించేందుకు పంపిణీదారులతో పుష్ప టీమ్ టచ్ లో ఉందని తెలిసింది.
మరోవైపు బన్నీకి అత్యంత కీలకమైన కేరళలో పుష్ప రిలీజ్ కాలేదని ప్రచారం సాగుతోంది. పుష్ప -ది రైజ్ మలయాళం వెర్షన్ షోలన్నీ ఒకరోజుకు రద్దు చేసారని గుసగుస వినిపిస్తోంది. ప్రింట్ లను సకాలంలో అందించడంలో నిర్మాతలు విఫలమయ్యారని.. దీనివల్ల షోలు 18వ తేదీ నుండి మాత్రమే ప్రారంభమవుతాయని టాక్ వినిపిస్తోంది.
మలయాళ వెర్షన్ స్థానంలో తమిళ వెర్షన్ ను డిసెంబర్ 17న కేరళలోని అన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారని తెలిసింది. కేరళలోని అల్లు అర్జున్ అభిమానులకు మేకర్స్ క్షమాపణలు చెప్పారు.
ఓవైపు రిలీజ్ టెన్షన్లను అధిగమిస్తూనే..పుష్ప టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సుక్కూ చివరి నిమిషం వరకూ ఎంతో శ్రమించారు. ఫైనల్ కాపీ కోసం పని చేసారు. మలయాళంలో పుష్ప విడుదలను ఆలస్యం కావడానికి కారణం చివరి నిమిషం హర్రీ వర్క్ అని తెలిసింది.
కేరళ మినహా అన్ని ఇతర ఏరియాల్లో సకాలంలో కంటెంట్ అందుబాటులో ఉందని తెలిసింది. ఒక భారీ పాన్ ఇండియా సినిమాని విడుదల చేయాలంటే ఉండే టెన్షన్స్ అన్నీ ఇన్నీ కావు. కానీ చాలా వరకూ పుష్ప టీమ్ సమస్యల్ని అధిగమించింది. ఒకటీ అరా .. ఆలస్యం చేయక తప్పడంలేదు.