Begin typing your search above and press return to search.
విక్టరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి ముహూర్తం పెట్టేశారా?
By: Tupaki Desk | 31 Dec 2022 10:32 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ది ప్రత్యేక శైలి. .మాస్ మసాలా ఎంటర్ టైనర్ లు చేయగలరు. అదే సమయంలో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు చేయగలరు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న విక్టరీ వెంకటేష్ హీరోగా తాజాగా కీలక మైలురాయిని చేరుకోబోతున్నారు. మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే సెంచరీ పూర్తి చేసుకోని వెంకటేష్ 2023లో తన కెరీర్ లో అత్యంత మైలురాయిగా భావించే 75వ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.
గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్, లేదా తేజలతో వెంకటేష్ తన మైల్ స్టోన్ మూవీని చేస్తారంటూ ప్రచారం జరిగింది. హారిక అండ్ హాసిని ఈ మూవీని నిర్మిస్తుందని వెంకటేష్ బర్త్ డే సందర్భంగా గతంలో ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. బ్లాక్ సూట్ ధరించి, మెడలో బ్యాగ్ తో వెంకీ కనిపించిన తీరు ప్రతీ ఒక్కరినీ సర్ ప్రైజ్ చేసింది. కానీ ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఎలా ఆగిందో..వంటి విషయాలు బయటికి రాలేదు.
తాజాగా మరోసారి వెంకటేష్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 75వ ప్రాజెక్ట్ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొంత మంది దర్శకులు వెంకటేష్ కు కథలు చెప్పారు. తరుణ్ భాస్కర్ తో సినిమా అంటూ డి. సురేష్ బాబు ప్రకటించారు కానీ ఇంత వరకు దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన లేదు. డి. సురేష్ బాబుతో పాటు తరుణ్ భాస్కర్ కూడా పెదవి విప్పడం లేదు. ఈ నేపథ్యంలో శివ నిర్వాణ, త్రినాథరావు నక్కిన హీరో వెంకటేష్ కు స్టోరీస్ వినిపించారట. అవి వెంకీ మామకు పెద్దగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట.
ఇదే సమయంలో హిట్ యూనివర్స్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లని సొంతం చేసుకుంటున్న దర్శకుడు శైలేష్ కొలను తాజాగా కథ వినిపించడం, వెంకటేష్ కు నచ్చడం జరిగిపోయాయని తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీస్టోరీ నేపథ్యంలో శైలేష్ కొలను ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నాడట. వెంకటేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 75వ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించబోతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
అత్యంత భారీ స్థాయిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని జనవరి 26న అత్యంత భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీలోని యాక్షన్ ఘట్టాలు ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయట. సినిమాకు ఇవే ప్రధాన హైలైట్ కావడంతో మేకర్స్ ఇందు కోసం భారీగా ఖర్చు చేయనున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.