Begin typing your search above and press return to search.
శ్రుతి లాజిక్.. సినిమా అరెంజ్డ్ మ్యారేజ్ లాంటిందా?
By: Tupaki Desk | 14 Aug 2021 1:30 AM GMTకమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్ మల్టీ ట్యాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే రాక్ బ్యాండ్ ని నిర్వహించింది. గాయనిగా తన గాత్రాన్ని పరిచయం చేసింది. ముఖానికి మేకప్ వేయక ముందే మంచి డాన్సర్... ఇప్పుడు స్టార్ హీరోయిన్ గాను వెలిగిపోతుంది. తెలుగు- తమిళ్-హిందీ అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే శ్రుతి కెరీర్ లో ఇదంతా యాధృచ్ఛికంగానే జరిగిందిట. శ్రుతి హాసన్ కి తొలుత సినిమాలంటే ఎంత మాత్రం ఇష్టం లేదు. సినిమాలనేది అరెంజ్డ్ మ్యారేజ్ లాంటివని తెలిపింది. కానీ ఇప్పుడు అదే సినిమాను ఎంతో ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. సినిమా లేకుండా ఉండలేకపోతున్నానని అంటోంది. మరి అంత ఇష్టం లేకుండా సినిమాల్లోకి రావడం ఎలా జరిగిందంటే? తన ర్యాక్ బాండ్ మెయింటనెన్స్ కోసం సినిమాల్లోకి రాక తప్పలేదని తెలిపింది. ఓ రెండు సినిమాలు చేస్తే తన ర్యాక్ బ్యాండ్ సమస్యలు తిరిపోతాయని తర్వాత మానేద్దామని అనుకుందిట. ర్యాక్ బ్యాండ్ రిహార్సల్స్ కి డబ్బుల కావాలి కాబట్టి సినిమా.
డ్రమ్స్ కిట్ తో పాటు యమహా కొనాలి. ఇంటి అద్దె కట్టాలి. బ్యాండ్ టీమ్ కి డబ్బులివ్వాలి. ఇలా రకరకాల సమస్యలతో ముఖానికి మేకప్ వేసుకోవడానికి ఒప్పుకుందిట. అలా బాలీవుడ్ లో `జానే తు యాజానే నా` చేసిందిట. ఆ సినిమా కథ వింటున్నప్పుడు తన ఖర్చుల తాలూకా బ్యాలెన్స్ షీట్ మాత్రమే గుర్తుండేదని తెలిపింది. కానీ సినిమా అనేది పద్మ వ్యూహం లాంటిందని..దిగిన తర్వాత వెనక్కి వెళ్లడం అసాధ్యమని అలా ఇప్పుడు సినిమానే శ్వాసిస్తున్నట్లు గా తెలిపింది. అన్నట్టు ఇటీవల లాక్ డౌన్ లో ఇల్లు ఈఎంఏ కట్టలేక సతమతమయ్యానని శ్రుతి తెలిపింది. ఆ సమస్య తీరిందో లేదో?