Begin typing your search above and press return to search.
VD క్రియేట్ చేసిన ఓవర్ హైపే కొంపముంచిందా..?
By: Tupaki Desk | 26 Aug 2022 10:30 AM GMTడైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు యువ హీరో విజయ్ దేవరకొండ కలిసి చేసిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ "లైగర్". ఇది ఇద్దరి కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అంతేకాదు హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా.. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది.
'ఇస్మార్ట్ శంకర్' తో ట్రాక్ లోకి వచ్చాడనిపించిన పూరీ జగన్నాథ్.. ఈసారి అత్యంత పేలవమైన సాదా సీదా కథతో "లైగర్" చిత్రాన్ని తీర్చిదిద్దారు. గతంలో ఎన్నో సినిమాల్లో చూసేసిన స్టోరీనే.. హీరో నత్తి తగిలించి చూపించారు అంతే. అందుకే తొలి రోజే సినీ అభిమానులు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.
పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విదులైన 'లైగర్' సినిమా ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ సైతం ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ పరాజయానికి పూరీ ని బాధ్యాన్ని చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. నమ్మి సినిమా చేసిందనందులు నిండా ముంచేసారని దర్శకుడిని టార్గెట్ చేశారు.
అయితే ఇక్కడ 'లైగర్' రిజల్ట్ లో పూరీకి ఎంత భాగం ఉందో, విజయ్ దేవరకొండ కు కూడా అంతే వాటా ఉందని చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు ఎలాంటి కథ రాసుకున్నా.. ఎందుకంటే హీరో ఓకే చేయకపోతే అది సినిమాగా కార్యరూపం దాల్చదు. అందులోనూ ఈ కథపై విజయ్ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా సినిమా గురించి ఊదరగొట్టాడు.
ఆగస్ట్ 25న ఇండియా మొత్తం షేక్ అవుతుందని వీడీ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. ఏ కార్యక్రమానికి వెళ్లినా నాలో ఎంతో ఫైర్ ఉందని.. అదంతా స్క్రీన్ మీద చూస్తారని.. ఆగ్ లగా దేంగే అంటూ పేర్కొన్నాడు. సినిమాలో తనకున్న నత్తి తోనే ప్రమోషన్స్ లో మాట్లాడుతూ వచ్చాడు. ఇదంతా 'లైగర్' చుట్టూ ఓవర్ హైప్ క్రియేట్ అవ్వడానికి కారణమైంది. ఇదే సినిమాకు మంచి బిజినెస్ జరగడానికి.. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటానికి కారణమైందని చెప్పాలి.
ఇక మూవీ ప్రమోషన్స్ లో లైగర్ గురించి విజయ్ ఓవర్ మాట్లాడుతున్నప్పుడే సాదారణ ప్రేక్షకులకు అనుమానం వచ్చింది. విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందనే సినీ డైలాగ్ ను గుర్తు చేసుకున్నారు. అయినా సరే ట్రైలర్ లో చూపించింది కొంతే.. అసలు సినిమా థియేటర్ లో కనిపిస్తుందని VD చెప్పడంతో అందరిలో ఏదో ఓ మూలన హోప్స్ ఉన్నాయి.
అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'మీకు మా అయ్య తెల్వదు.. మా తాత తెల్వదు.. ఎవ్వడూ తెల్వదు. అయినా ట్రైలర్ కే ఈ రచ్చ ఏందిరా నాయనా' అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ విజయ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గని రౌడీ స్టార్.. అదే దూకుడుతో ముందుకు వెళ్ళాడు.
తీరా నిన్న సినిమా చూశాక 'VD ఇన్నాళ్లు మాట్లాడింది ఈ మూవీ గురించేనా?' అని ఆడియన్స్ ముక్కున వేలేసుకున్నారు. పాన్ ఇండియా కోసం ఇలాంటి రొటీన్ కథని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? దీంతో ఎలా పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని అనుకున్నాడు? అని ట్రోల్స్ చేస్తున్నారు.
కంటెంట్ ని నమ్ముకోకుండా పబ్లిసిటీని వివాదాలను నమ్ముకుంటే సినిమా ఫలితం ఇలానే ఉంటుందని విజయ్ ఇప్పటికైనా తెలుసుకోవాలని జనరల్ ఆడియన్స్ సూచిస్తున్నారు. ఒక్కసారి ఓవర్ హైప్ కూడా చేటు చేస్తుందని సలహా ఇస్తున్నారు. కథ లేకపోయినా అనవసరమైన అంచనాలు పెంచేయడమే ఇప్పుడు 'లైగర్' కొంప ముంచిందని అంటున్నారు.
'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారైనా జాగ్రత్తపడి ఉండాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సినిమాల ప్రమోషన్స్ లో విజయ్ స్పీచ్ లు ఓవర్ హైప్ క్రియేట్ చేసాయి. అయితే సినిమాలో విషయం లేకపోవడంతో మొదటికే మోసం వచ్చింది.
ఇప్పుడు 'లైగర్' సినిమా విషయంలోనూ విజయ్ దేవరకొండ అలాంటి స్ట్రాటజీనే ఫాలో అయ్యాడు. మూవీని విపరీతంగా ప్రచారం చేసి హైప్ తీసుకొచ్చాడు. వందల కోట్లు ఖర్చు చేసిన చిత్రానికి పబ్లిసిటీ అవసరమే కానీ.. అసలు కంటెంట్ లేని సినిమాకి 'ఓవర్' హైప్ అవసరం లేదని నెటిజన్లు అంటున్నారు.
'పుష్ప' 'కార్తికేయ 2' 'బింబిసార' 'సీతారామం' వంటి సినిమాలకు ఎంత అవసరమో అంత వరకే ప్రచారం చేశారు. తాము మాట్లాడటం కాదు.. కంటెంట్ మాట్లాడాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి భారీ విజయాలను అందుకున్నారు. కానీ ఇక్కడ 'లైగర్' విషయంలో పూర్తి భిన్నంగా జరిగింది.
అందుకే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటి నుంచైనా విజయ్ దేవరకొండ పబ్లిసిటీని కాకుండా కంటెంట్ ను నమ్ముకోవాలని కామెంట్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' కి జరిగినట్లు అన్ని సినిమాలకూ జరుగుతుందని అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని సూచిస్తున్నారు. రాబోయే సినిమాల విషయంలోనైనా VD ఈ సూచనలు పాటిస్తారేమో చూడాలి.