Begin typing your search above and press return to search.
ప్రతిష్టాత్మక చిత్రం కూడా డిజాస్టర్స్ లిస్టులో చేరినట్లేనా..?
By: Tupaki Desk | 12 Oct 2022 2:30 AM GMTబాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ''బ్రహ్మాస్త్రం''. గత నెల రెండో వారంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ మూవీ చుట్టూ నెలకొన్న హైప్ దృష్ట్యా ఇది కచ్చితంగా హిందీ చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తుందని భావించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సోసియో ఫాంటసీ డ్రామాకి మిశ్రమ స్పందన లభించింది.
విస్తృతంగా బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో థియేటర్లలోకి వచ్చిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీనికి తగ్గట్టుగానే విమర్శకుల నుంచి సానుకూలమైన రివ్యూలు రేటింగులు రాలేదు. అయితే డివైడ్ టాక్ తెచ్చుకునన్నప్పటీ.. మొదటి వారంలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. వసూళ్ళు క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. ఎక్కువ రోజులు థియేట్రికల్ రన్ కొనసాగించగలిగింది.
అయితే 'బ్రహ్మాస్త్ర' సినిమా బడ్జెట్ కోణంలో చూస్తే మాత్రం మేకర్స్ లాభాలు తెచ్చిపెట్టలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత కరణ్ జోహార్ ఫస్ట్ వీకెండ్ లోనే ఇది బ్లాక్ బస్టర్ అని పోస్టర్ రిలీజ్ చేసినప్పటికీ.. దాదాపు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నంబర్లు చూస్తే నష్టాలు మిగిల్చినట్లుగా అర్థమవుతుంది.
'బ్రహ్మాస్త్ర' సినిమా బిజినెస్ దాదాపు రూ.600 కోట్ల వరకూ జరిగినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అంటే రూ.300 కోట్ల షేర్ వసూలు చేస్తే తప్పు బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. కానీ ఇప్పుడు ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల గ్రాస్ తో రూ. 200 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
నివేదికల ప్రకారం 'బ్రహ్మాస్త్ర' సినిమా 66 శాతం మాత్రమే రికవరీ చేసింది. దీన్ని బట్టి నిర్మాతలకు 100 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నమాట. నార్త్ మార్కెట్లో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఆగిపోయిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించినట్లు తెలుస్తోంది.
మూడు భాగాలుగా ప్లాన్ చేసిన 'బ్రహ్మాస్త్ర' మొదటి భాగాన్ని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నాలుగు దక్షిణాది భాషల్లో సమర్పకుడిగా వ్యవహరించారు. అలానే కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాలో భాగం అవ్వడం.. దూకుడుగా ప్రమోట్ చేయడంతో తెలుగులో అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. కాకపోతే ఓవరాల్ లెక్కలు చూసుకుంటే మాత్రం విశ్లేషకులు ఈ చిత్రాన్ని డిజాస్టర్ గా ప్రకటిస్తున్నారు.
'బ్రహ్మాస్త్ర: శివ' సినిమాలో రణబీర్ కపూర్ - అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - కింగ్ నాగార్జున - మౌని రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు.
అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రెండో భాగాన్ని ''బ్రహ్మాస్త్రం: దేవ్'' పేరుతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో ప్రధాన పాత్రలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత ఎఫెర్ట్స్ పెట్టే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.