Begin typing your search above and press return to search.

ఆ భేటీపై `ఆదిపురుష్` రిలీజ్ ఆధార‌ప‌డిందా?

By:  Tupaki Desk   |   24 Oct 2022 11:18 AM GMT
ఆ భేటీపై `ఆదిపురుష్` రిలీజ్ ఆధార‌ప‌డిందా?
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్` పై నెల‌కొన్న అంచ‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆరంభంలో సినిమాపై నెగివిటీ స్ప్రెడ్ అయినా అటుపై ఒక్క‌సారిగా బ‌జ్ ఊపందుకుంది. రిలీజ్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో విడుద‌ల తేదీ కోసం ప్రేక్ష‌కాభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ తేదీకి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని టీమ్ ప్రామిస్ చేసింది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబ‌ట్టి తేదీ మార‌డానికి కూడా అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌న్ని మ‌రో బ‌ల‌మైన సంకేతం. మ‌రి `ఆదిపురుష్` అనుకున్న తేదీకే రిలీజ్ అవుతుందా? సంక్రాంతి డేట్ లాక్ చేసుకోవ‌చ్చా? అంటే తాజాగా కొత్త సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

సంక్రాంతి రిలీజ్ విష‌యంలో హిందీ..త‌మిళ్ లో ఆదిపురుష్‌కి ఎలాంటి ఇబ్బందులేవ్. కానీ తెలుగులో మూడు సినిమాలు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్నాయి. ఆ మూడింటి పోటీని అది పురుష్ పై కొంత ప్ర‌భావం చూపియాస్తాయ‌ని వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో అదిపురుష్ ని వారం ముందుకు తీసుకురావ‌డం గానీ..రెండు వారాలు వెన‌క్కి వాయిదా వేసే అవ‌కాశం ఉంద‌ని కొత్త స‌మాచారం.

జ‌న‌వ‌రి 6వ తేదీ గా లీక్ అందుతోంది. ఆ తేదీన రిలీజ్ చేస్తే వారం పాటు సోలోగా దున్నుకోవ‌చ్చు. అటుపై వ‌చ్చేవ‌న్ని లాభాలుగా క‌నిపిస్తాయి. ఎలాగూ పండ‌గ కాబ‌ట్టి క‌లిసొస్తుంది. పోటీ ఉన్నా..టిక్కెట్లు దొర‌క‌ని ఆడియ‌న్స్ ఆదిపురుష్ వైపు చూసే ఛాన్స్ ఉంది. లేదంటే పండ‌గ సీజ‌న్ వ‌దిలేసి రెండు వారాలు వాయిదా వేసుకుని రిలీజ్ చేసినా ఆదిపురుష్ కి ఇబ్బంది ఉండ‌దు అన్న‌ది మ‌రో ఆప్ష‌న్ గా క‌నిపిస్తుంది.

త్వ‌ర‌లోనే బాలీవుడ్ సినిమాల రిలీజ్ ల‌పై ఓ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆ భేటి త‌ర్వాత ఆదిపురుష్ రిలీజ్ పై పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. సంక్రాంతి కి ఎలాగూ రెండు నెల‌లకు పైగా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి కూల్ గా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.