Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' సీక్వెల్ డిమాండ్ సాధ్య‌మేనా?

By:  Tupaki Desk   |   28 March 2022 7:42 AM GMT
ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ డిమాండ్ సాధ్య‌మేనా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీ కొనసాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన సినిమా ఉత్త‌రాది మిహాన అన్ని చోట్లా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తార‌క్-చ‌ర‌ణ్ ఎవ‌రి పాత్ర‌ల్లో వారు అభిమానుల్ని ఆక‌ట్టుకున్నారు. బిగ్ స్టార్స్ ఇద్ద‌రు పాన్ ఇండియా హీరోలుగా ఫేమ‌స్ అయ్యారు.

జ‌క్క‌న్న మార్క్ మేకింగ్ తో 'ఆర్ ఆర్ ఆర్' ప్రేక్ష‌కుల్ని విజువ‌ల్ ట్రీట్ తో ఆక‌ట్టుకుటుంది. ఇక చ‌ర‌ణ్‌-తార‌క్ అభిమానుల ఆనందానికైతే అవ‌ధుల్లేవ్. బిగ్ స్టార్స్ ఇద్ద‌ర్నీ ఒకే ప్రేమ్ లో చూసుకుని మురిసిపోతున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి రేర్ మూవ్ మెంట్స్ మ‌రిన్ని రావాలంటూ ఆశ‌డుతున్నారు. ఇదే ఉత్సాహంలో 'ఆర్ ఆర్ ఆర్ 'కి సీక్వెల్ చేయాలంటే జ‌క్క‌న్న పై అప్పుడే ఒత్తిడి మొద‌లైపోల‌యింది.

రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ ల‌ని మూడు గంట‌ల‌లో చూపించ‌డం గానీ..వాళ్ల‌ని కేవ‌లం మూడు గంట‌ల‌లో మాత్ర‌మే చూసే హీరోలు కాద‌ని అంత‌కు మించి అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ ఇద్ద‌ర్ని మూడు గంట‌ల్లో చూడ‌టం అంటే అసంతృప్తిగానే ఉంటుంద‌ని అంటున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' కి కొనసాగింపుగా లేదా! సీక్వెల్ ఉంటే తీస్తే బాగుంటుంద‌ని మెజార్టీ వ‌ర్గం ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇది జర‌గ‌డం అన్న‌ది అంత వీజీ కాదు. 'బాహుబ‌లి'ని రెండు భాగాలుగా తీసిన నేప‌థ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' ని కూడా రాజ‌మౌళి రెండు భాగాలు గా చేస్తే బాగుంటుంది అన్న కోణంలో నుంచి ఈ విష‌యం బ‌య‌టకి వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.ల 'బాహుబ‌లి' రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్న‌ట్లు ముందే రివీల్ చేసారు. ఆ క‌థ అలాంట‌లింది. మూడు గంట‌ల్లో చెప్పాల్సిన స్టోరీ కాదు కాబ‌ట్టి రెండు భాగాలు 'బాహుబ‌లి'ని తెరకెక్కించారు.

కానీ 'ఆర్ ఆర్ ఆర్' ని రెండు భాగాలు చేస్తామ‌ని ఏ నాడు రివీల్ చేయ‌లేదు. చెప్పాల్సిన క‌థ‌ని ఒకే క‌థ‌గా ఇద్ద‌రి హీరోల‌తో ముగించారు. ఇద్ద‌రు విప్ల‌వ యోథుల పాత్ర‌లు తీసుకుని కేవ‌లం డ్రెమ‌టైజ్ చేసి క‌మ‌ర్శియ‌ల్ గా మ‌లిచారు. దీనికి మ‌ళ్లీ కొన‌సాగింపు...సీక్వెల్ అంటే సాధ్య‌ప‌డే ప‌ని కాదు. పైగా 'ఆర్ ఆర్ ఆర్' కి ఉత్త‌రాది ఆడియ‌న్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. పాన్ ఇండియా సినిమాకి హిందీ మార్కెట్ అత్యంత కీల‌కం.

కానీ 'ఆర్ ఆర్ ఆర్' అక్క‌డ వ‌ర్కౌట్ కాలేదు. యూనిక్ స్టోరీగా 'ఆర్ ఆర్ ఆర్' ఎలివేట్ అవ్వ‌లేదు. కేవ‌లం క‌మ‌ర్శియ‌ల్ గానే సినిమా జ‌నాల్లోకి వెళ్లింది. 'ఆర్ ఆర్ ఆర్' కి సీక్వెల్ ఉండ‌ద‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇదివ‌ర‌కే హింట్ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. అభిమానులు కోరిక‌ని మేకర్స్ అర్ధం చేసుకోగ‌ల‌రు. సీక్వెల్ ఆశించొద్దు. వీలైన‌న్ని సార్టు 'ఆర్ ఆర్ ఆర్' ని థియేట‌ర్లో చూసి ఆస్వాదించ‌డ‌మే అన్న‌ది మేక‌ర్స్ మాట‌గా తెలుస్తోంది.