Begin typing your search above and press return to search.
స్టార్ ప్రొడ్యూసర్ ది సినిమాకు మించిన ప్రేమకథా?
By: Tupaki Desk | 17 Jan 2023 2:30 AM GMTటాలీవుడ్ లో వున్న టాప్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు పేరు ప్రధానంగా వినిపిస్తూ వుంటుంది. నిర్మాతగా, నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గత కొంత కాలంగా దిల్ రాజు పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతోంది. టాలీవుడ్ లో సూటింగ్ ల బంద్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యవహారాల పరంగానూ.. రీసెంట్ గా 'వారసుడు' రిలీజ్ విషయంలోనూ టాలీవుడ్ లో దిల్ రాజు పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. నిర్మాతగా తనదైన మార్కు సినిమాలతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారాయన.
2003లో నితిన్ హీరోగా నటించిన 'దిల్'తో నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టారు. తాఆజగా 'వారీసు'తో తమిళ ఇండస్ట్రీలోనూఅడుగు పెట్టారు. ఇదిలా వుంటే ఆయన రెండో పెళ్లి వెనక సినిమాను మించిక కథే వుందని తెలుస్తోంది. 20017లో దిల్ రాజు భార్య అనిత గుండెపోటు కారణంగా మృతిచెందిన విషయం తెలిసిందే. తనపై వున్న ప్రేమతో మూడేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని అనుభవించిన దిల్ రాజు ఆ తరువాత తేజస్విని వివాహం చేసుకున్నారు.
వైఘారెడ్డిగా పేరు మార్చి 2020లో అత్యంత సన్నిహితుల మధ్య దిల్ రాజు రెండవ వివాహం జరిగింది. రీసెంట్ గానే వీరికి ఓ మగ బిడ్డ పుట్టాడు. అయితే తమ పెళ్లి వెనక సినిమాకు మించిన కథే వుందని ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు దంపతులు వెల్లడించడం వైరల్ గా మారింది. గత కొంత కాలంగా పలు మీడియాలకు ప్రత్యత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్న దిల్ రాజు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత విషయాల్ని వెల్లడించలేదు.
కానీ తొలి సారి సంక్రాంతి సందర్భంగా ఓ మీడియా హౌస్ ప్రత్యేకంగా జరిపిన చిట్ చాట్ లో దిల్ రాజు ఆయన సతీమణి తేజస్వీని తమ పెళ్లి వెనకున్న ఆసక్తికరమైన కథని పంచుకున్నారు. దిల్ రాజు జీవితంలోకి తేజస్విని ఎలా వచ్చారు? అసలు వీరిద్దరి పరిచయం ఎక్కడ ఎలా జరిగింది? ఆ పరిచయం ఎలా పెళ్లికి దారి తీసిందో స్పష్టంగా వివరించడం విశేషం. దిల్ రాజు మాట్లాడుతూ ...నా మొదటి భార్య అనిత మరణించిన తరువాత రెండేళ్లు చాలా కష్టాన్ని అనుభవించాను. అప్పటికి నా వయసు 47 ఏళ్లు.
జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకుంటున్న సమయంలో నాకు రెండు మూడు ఆప్షన్ లు ఎదురయ్యాయి. అయితే నేను మాత్రం నన్ను నన్నుగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలనుకున్నాం. అదే సమయంలో నాకు విమాన ప్రయాణంలో తేజస్విని పరిచయం అయింది. తన ఫోన్ నంబర్ తీసుకుని సంవత్సరం పాటు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. తనకు ఒకానొక రోజు ప్రపోజ్ చేయడం.. ఆ తరువాత ఫ్యామిలీతో మాట్లాడటం చివరికి వివాహం చేసుకోవడం తెలిసిందే' అన్నారు. ఇక దిల్ రాజు గురించి తేజస్విని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్న సమయంలో నేను ఏయిర్ లైన్స్ లో వర్క్ చేస్తున్నాను. నేను షిఫ్ట్ లో వున్న ప్రీసారి ఆయన నాకు కనిపించడంతో మా మధ్య పరిచయం పెరిగింది.. అదే పెళ్లి దాకా తీసుకొచ్చిందని తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.