Begin typing your search above and press return to search.
కొరటాల అక్కడి కథే ఇక్కడ ఒప్పించాడా..??
By: Tupaki Desk | 5 Jun 2021 8:30 AM GMTతెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రదర్శకులలో ఒకరుగా ఉన్నాడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉందట. అయితే కొరటాల తదుపరి సినిమా విషయంలో ఇటీవలే చర్చలు ముగిసి ఎన్టీఆర్ తో అని ఖరారు అయిపోయింది. కానీ ఈ సినిమా పై ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నిజానికి కొరటాల ఆచార్య సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. కానీ చివరిగా ఏమైందో గాని అల్లు అర్జున్ తో కొరటాల సినిమా ఆగిపోయిందని అనుకున్నారు.
ఆ వెంటనే దర్శకుడు కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడు కొరటాల. మరి అసలు అల్లు అర్జున్ సినిమా ఎందుకు కుదరలేదు..?అనే ప్రశ్నకు సమాధానం మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటంటే.. కొరటాల అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన స్టోరీ లైన్ ఓ స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా మరి కొద్దీరోజుల్లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అయితే తాజాగా బన్నీ నుండి సినిమా ఎన్టీఆర్ వద్దకు ఎందుకు వెళ్లిందంటే మాత్రం.. నిజానికి కొరటాల పుష్ప సినిమా కంప్లీట్ కాగానే వెంటనే అల్లు అర్జున్ తో సినిమా చేసేయాలని అనుకున్నాడట. కానీ అల్లు అర్జున్ పుష్ప మేకర్స్ ఆ మూవీ రెండు భాగాలుగా ఉండబోతుందని ప్రకటించే సరికి కొరటాల నిర్ణయం మార్చుకొని ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ తో స్టోరీ ఓకే చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఓకే చేసిన స్టోరీ బన్నీకి వినిపించిందే అని టాక్. స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో ఇదివరకు కూడా ఎన్టీఆర్ నాగ అనే సినిమాలో పొలిటికల్ రోల్ చేసాడు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. మరి ఈ సినిమా పాలిటిక్స్ నేపథ్యంలో అంటే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ ఓవైపు కొరటాల మీద కూడా నమ్మకం ఉందంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో..!