Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలుగు మార్కెట్ అంతా బాగేనా?
By: Tupaki Desk | 18 July 2021 7:36 AM GMTతెలుగు సినిమాకి అమెరికా మార్కెట్ చాలా కీలకం. అగ్ర హీరోల సినిమాలు సుమారు 15-20 కోట్లు వసూలు చేస్తున్నాయి. 3.5 మిలియన్ డాలర్ వసూళ్లు యుఎస్ మార్కెట్లో సాధ్యమని ట్రేడ్ విశ్లేషించింది. చిన్న హీరోలు కొత్త హీరోలు అయినా కంటెంట్ ఉంటే ఆదరిస్తున్నారు. అందుకే అలాంటి కీలక మార్కెట్ కరోనా క్రైసిస్ వల్ల క్లోజ్ అవ్వడం ఇండస్ట్రీకి పెద్ద హెడేక్ అయ్యింది. తిరిగి అమెరికా మార్కెట్ ను పునరుద్ధరించేది ఎప్పుడు? అక్కడ కోవిడ్ సన్నివేశం ఎలా ఉంది? అన్నది ఆరా తీస్తే...
అమెరికాలో సన్నివేశం ఇప్పుడు మనకంటే ఉత్తమంగా ఉందని సమాచారం. అమెరికాలోని 20 కోట్ల మందికి అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రభుత్వం సఫలమైంది. కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఇక మహమ్మారి సమయంలో అమెరికాలోని భారతీయ సమాజం అత్యంత జాగరూకతతో వ్యవహరించింది. వర్క్ ఫ్రం హోం కల్చర్ వల్ల చాలా వరకూ మన ఎన్నారైలు సేఫ్ గా ఉన్నారు. కోవిడ్ భద్రతా నియమాలను పాటించడంలో క్రమశిక్షణ మనవారికి అలవాటైంది. ఎన్నారైలందరికీ దాదాపు టీకాలు వేస్తున్నారు. అయితే ఏడాది పైగానే ఇండ్లలో ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి విహార యాత్రలకు వెళుతున్నారని తెలిసింది.
అంటే ఇప్పటికే ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. ఇకపై థియేటర్లకు వెళ్లేందుకు ఆస్కారం ఉంది. హాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకు ఇకపై అమెరికాలో ఆదరణ దక్కేందుకు అవకాశం ఉంది. సరైన క్రేజు ఉన్న తెలుగు సినిమాలు రిలీజైతే జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు వీలుంటుంది. వెంకటేష్ నారప్ప ఓటీటీలో రిలీజవుతుండగా.. నాని `టక్ జగదీష్`... నాగ చైతన్య `లవ్ స్టోరి` థియేట్రికల్ రిలీజ్ లకు వెయిట్ చేస్తున్నాయన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఈ చిత్రాలను తెలుగు రాష్ట్రాలు సహా విదేశాల్లోనూ రిలీజ్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే భావిస్తున్నారు. కోవిడ్ పరిస్థితిని బట్టి ఈ చిత్రాలను అమెరికాలో ప్లాన్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్ది రోజుల్లోనే క్రేజీ సినిమాల రిలీజ్ తేదీలపై స్పష్ఠత వచ్చేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక థర్డ్ వేవ్ భయాలను ఈసారి రిలీజ్ చేసేవాళ్లు దృష్టిలో పెట్టుకున్నారు.