Begin typing your search above and press return to search.
ఎఫ్ 2 సీక్వెల్ కి రైట్ టైమ్ ఇది కాదా!
By: Tupaki Desk | 28 Jan 2020 1:30 AM GMTసంక్రాంతి పందెంలో సరిలేరు నీకెవ్వరు సంతృప్తికర ఫలితం ఇచ్చిందని అనీల్ రావిపూడి బృందం చెబుతోంది. ఆరంభం క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా `సరిలేరు నీకెవ్వరు` కలెక్షన్స్ బావుండడంతో అతడు రెట్టించిన ఉత్సాహంలో సక్సెస్ వేడుకల్లో పాల్గొన్నాడు. అదే ఊపులో ఎఫ్ -2కి సీక్వెల్ గా ఎఫ్-3 తెరకెక్కించడానికి అతడు రెడీ అవుతున్నాడట. ఎఫ్-2 భారీ సక్సెస్ సాధించడంతోనే ఎఫ్-3 తెరకెక్కిస్తామని దిల్ రాజు బృందం ఇదివరకూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనీల్ రావిపూడి సీక్వెల్ పని మొదలు పెట్టాడట. ఈసారి కూడా ఎఫ్ -2లో నటించిన వెంకటేష్- వరుణ్ తేజ్ లనే హీరోలుగా కొనసాగించాలని అనుకుంటున్నారు. టైటిల్ కి మరో నంబరు యాడవుతోంది కాబట్టి అదనంగా మాస్ మహా రాజా రవితేజను ఈ టీమ్ కి జాయిన్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
ఎఫ్-3 బౌండెడ్ స్క్రిప్టు రెడీ అవుతోంది. మరో రెండు మూడు నెలల్లో పూర్తి స్క్రిప్ట్ సిద్దం అవుతుందని అనీల్ తాజాగా వెల్లడించారు. ఈ గ్యాప్ లో కాస్టింగ్ పైనా థింక్ చేస్తున్నాడట. అయితే ఈ టైమ్ లో ఎఫ్-3 కరెక్టేనా? ఈ ఏడాదిలోనే పూర్తి చేసి రిలీజ్ కి తెచ్చేయడం కరెక్టేనా? అన్న తర్జనభర్జన పడుతున్నారట. ఎఫ్-2 విజయానికి కామెడీతో పాటు ఫ్యామిలీస్ లో స్పైసీ యాంగిల్ ని టచ్ చేయడం కలిసొచ్చింది. అనీల్ రావిపూడి మార్క్ కామెడీ సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇదే ఫార్ములాని సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఉపయోగించి సక్సెసయ్యారు. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ సహా కామెడీ టచ్ ఇచ్చిన సీన్లన్నీ ఎఫ్ 2ని తలపించాయి.
ఇంతకుముందే చూపించినదే అయినా ఆడియెన్ అడ్జస్ట్ అయ్యారు. అయితే పదే పదే ఆ తరహా ట్రై చేస్తే మాత్రం కష్టమే. ఇంతకుముందు ఇలా రిపీట్ చేయడం వల్లనే శ్రీనువైట్లు చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో ఫుల్ మూవీ కామెడీ చేయించే ట్రెండ్ మొదలు పెట్టింది శ్రీనువైట్లనే. ఢీ- రెడీ- దూకుడు- ఆగడు లాంటి చిత్రాలు ఈ తరహాలోనే ఒకే జానర్ కామెడీతో తెరకెక్కాయి. ఢీ- రెడీ ఒకే జానర్ చిత్రాలు...ఒకే రకమైన కామెడీ. అప్పటి ఆడియన్స్ కి అది కొత్త కాబట్టి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత దూకుడు బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ నమ్మకంతోనే అదే జానర్ కామెడీతో ఆగడు తెరకెక్కించాలనుకుని దెబ్బయిపోయారు. ఈ ఒక్క పరాజయం శ్రీనువైట్ల కెరీర్ నే డైలమాలోకి నెట్టేసింది. స్టార్ డైరెక్టర్ గా ఉన్న అతని స్థాయి ఒకేసారి కిందికి పడిపోయింది.
బ్యాక్ టు బ్యాక్ ఒకే తరహా చిత్రాల్ని పెద్దగా గ్యాప్ తీసుకోకుండా తెరకెక్కించడం అతడికి మైనస్ అయ్యింది. ఇప్పుడు అనీల్ రావిపూడి ఎఫ్-3 ని ప్రకటించి ఆ తరహాలోనే డేంజర్ జోన్ లో పడ్డాడని కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకే జోనర్ సినిమాలు వెంట వెంటనే చేయడం రిస్క్ అని విశ్లేషిస్తున్నారు. రొటీన్ కామెడీ ట్రై చేస్తే ప్రతీసారి ఆడియన్స్ ఒకేలా రిసీవ్ చేసుకోరన్న విమర్శ వినిపిస్తోంది. ఎఫ్-3 కి అయితే ఇది అస్సలు సరైన సమయం కాదని ఓ బలమైన వాదన వినిపిస్తోంది.