Begin typing your search above and press return to search.
RC15 ఆర్ట్ డైరెక్టర్ మార్పు వార్తల్లో నిజమెంత..?
By: Tupaki Desk | 30 July 2022 11:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కెరీర్ లో 15వ చిత్రం.. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా.
అంతేకాదు దిల్ రాజు బ్యానర్ లో మైలురాయి 50వ చిత్రం కావడం.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమా అవ్వడంతో మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దిల్ రాజ్ గత చిత్రాల కంటే అధిక బడ్జెట్ తో RC15 మూవీ తెరకెక్కనుంది. ఎంత భారీ సినిమా అయినా బడ్జెట్ విషయంలో కంట్రోల్ లోనే ఉంచాలని స్టార్ ప్రొడ్యూసర్ భావిస్తుంటారు.
మరోవైపు శంకర్ మాత్రం భారీ తనానికి పెట్టింది పేరు. విజువల్ ఎఫెక్ట్స్ - సెట్స్ నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేసేస్తుంటారు. పాటలు ఫైట్స్ కే కోట్ల రూపాయలు పెడుతుంటారు. కానీ చరణ్ సినిమా విషయంలో శంకర్ కాస్త రూట్ మార్చినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ కన్నా సెట్ వర్క్ మీదే కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్లు టాక్.
కాకపోతే సీజీ ఖర్చు తగ్గుతున్నప్పటికీ.. భారీ సెట్స్ వల్ల నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతోందని రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ట్ డైరెక్టర్ కు దిల్ రాజుకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవి మరింత ముదరడంతో ఇప్పుడు ఆర్ట్ డైరక్టర్ నే మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇప్పుడు రామకృష్ణ ఈ సినిమాకు ఆర్ట్ చూసుకున్నారు. అతని ప్లేస్ లోకి ఆర్ రవీందర్ వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ని మార్చినా.. బడ్జెట్ ఎలా కంట్రోల్ లోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎందుకంటే దర్శకుడి ఆలోచన మేరకు సూచనల ప్రకారమే ఏ ఆర్ట్ డైరెక్టర్ అయినా సెట్స్ నిర్మిస్తుంటారు. శంకర్ అంటే ఎవరైనా ఆ స్థాయికి తగ్గట్టుగానే సెట్ వర్క్ చేస్తారు.. డైరెక్టర్ కూడా అదే కోరుకుంటూ వచ్చారు కూడా. ఇప్పుడు RC15 కు కొత్త ఆర్ట్ డైరెక్టర్ ను తీసుకొస్తే దర్శకుడితో సింక్ అవడానికి కాస్త సమయం పడుతుంది. దీని మూలంగా షూటింగ్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇదే జరిగితే ఈ విధంగా నిర్మాతలకు సమయంతో పాటుగా బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పాలి. ఇవన్నీ ఆలోచిస్తే దిల్ రాజు అలాంటి ఆలోచన చేయకపోవచ్చు. దీనికి తోడు ఇప్పుడు శంకర్ 'ఇండియన్ 2' 'RC15' సినిమాలను సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే అనుకున్న టైం కి రామ్ చరణ్ సినిమా కంప్లీట్ అవుతుందో లేదో చెప్పలేం. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
RC15 అనేది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిలర్. విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెప్పిన ఐడియాతో ఈ కథ రెడీ చేసినట్లు సమాచారం. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో మూడు విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా RC15 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.