Begin typing your search above and press return to search.

'ఆచార్య‌'కు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ ఆఫ‌ర్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   3 May 2022 7:32 AM GMT
ఆచార్య‌కు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ ఆఫ‌ర్ ఇచ్చారా?
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే 'ఆచార్య‌' బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ మూవీ ఏ విష‌యంలోనూ ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయింది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ట్రాక్ రికార్డ్ ని మ‌స‌క బారేలా చేసింది. 'మిర్చి' నుంచి 'భ‌ర‌త్ అనే నేను' చిత్రాల వ‌ర‌కు ఈ స్టార్ డైరెక్ట‌ర్ కు ఒక్క ఫ్లాప్ లేదు. చేసిన‌వ‌న్నీ హిట్ లు కాదు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు. ఈ ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ చిరు - కొర‌టాల శివ కాంబినేష‌న్ అన‌గానే భారీగా ఎక్స్ పెక్ట్ చేశారు. అంతే కాకుండా ఈ మూవీలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డంతో ఆ ఎక్స్ పెక్టేష‌న్స్ మ‌రింత స్కై హైకి చేరుకున్నాయి.

అయితే ఇన్ని ప్ర‌త్యేత‌లతో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌లై అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కుల్ని తీవ్రంగా నిరాశ ప‌రిచింది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కున్న ట్రాక్ రికార్డ్ స్మాష్ చేసింది. ఎంతో ఆస‌క్తిగా అభిమాన హీరో సినిమా అని ఎదురుచూసిన అభిమానుల‌కు ఊహించ‌ని షాకిచ్చింది. అంతే కాకుండా తొలి సారి తండ్రీ కొడుకులిద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమా డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డం మెగా వారికి ఊహించ‌ని షాక్ గా మారింది.

భారీ అంచ‌నాలు పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో జీర్ణించుకోలేక‌పోతున్నా ఫ్యాన్స్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఆయ‌న వల్లే సినిమా ఇలాంటి ఫ‌లితాన్ని అందుకుంద‌ని, ఆయ‌న చేసిన త‌ప్పిదాల వ‌ల్లే 'ఆచార్య‌' డిజాస్ట‌ర్ గా నిలిచింద‌ని ట్రోల్ చేస్తున్నారు. సిల్లీ మేకింగ్ కార‌ణంగానే సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది.

'ఆచార్య‌' చిత్రాన్ని ముందు ఓటీటీలో డైరెక్ట్‌ రిలీజ్ చేయాల‌ని ఓ ప్ర‌ముఖ టీటీ దిగ్గ‌జం ఒత్త‌డి చేయింద‌ని, ఇందుకు భారీ మొత్తాన్ని అందించేందుకు మేక‌ర్స్ కి భారీ ఆఫ‌ర్ ని కూడా చేసింద‌ని చెబుతున్నారు. ఇది సెకండ్ లాక్ డౌన్ స‌మ‌యంలో జ‌రిగింద‌ని, ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ 'ఆచార్య‌' మేక‌ర్స్ కి ఈ ఆఫ‌ర్ ని అందించింద‌ని, అయితే వారు ఈ చిత్రాన్ని ఎట్టిప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తామ‌ని, ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయ‌మ‌ని ఖ‌రా కండీగా చెప్పేసి అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ఆఫ‌ర్ ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే తాజా విడుద‌లైన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో చాలా మంది ఈ విష‌యం తెలిసి మేక‌ర్స్ పై సెటైర్లు వేస్తున్నార‌ట‌. అదే ఆఫ‌ర్ ని అంగీక‌రించి వుంటే ఎంతో మంది బ‌య్య‌ర్ల‌ని సేఫ్ చేసిన వార‌య్యే వార‌ని విమ‌ర్శలు చేస్తున్నార‌ట‌. ఈ సినిమా కార‌ణంగా ప్ర‌స్తుతం బ‌య్య‌ర్స్ దాదాపు 100 కోట్లు న‌ష్ట‌పోయే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఓటీటీలో రిలీజ్ చేసి వుంటే బ‌య్య‌ర్ల‌కు ఈ న‌ష్టం త‌ప్పేది క‌దా అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా అంటున్నార‌ట‌.