Begin typing your search above and press return to search.

'పుష్ప'లో లవ్‌ స్టోరీ ఉండదా?

By:  Tupaki Desk   |   8 Aug 2021 3:30 PM GMT
పుష్పలో లవ్‌ స్టోరీ ఉండదా?
X
అల్లు అర్జున్‌.. రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ల కాంబో లో లవ్‌ సీన్స్‌ ఉంటాయని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమాలో ప్రేమ కథ ఉండదని.. సినిమా ఆరంభమే హీరో మరియు హీరోయిన్‌ లు భార్య భర్తలుగా చూపిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఫ్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్ లో కూడా ప్రేమ సన్నివేశాలు ఉండక పోవచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది. మొదటి పార్ట్‌ మొత్తం కూడా పుష్ప రాజ్‌ ట్రక్‌ డ్రైవర్‌ గా ఎలా ఎర్ర చందనం ను స్మగ్లింగ్‌ చేస్తూ వచ్చాడు అనేది చూపించబోతున్నారట.

రష్మిక పాత్ర సినిమాలో డీ గ్లామర్ గా ఉంటుందని... నారప్పలో ప్రియమణి తరహాలో రష్మిక కనిపించబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమాకు సంబంధించిన ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రష్మిక మరియు అల్లు అర్జున్ ల మద్య లవ్‌ కమ్‌ రొమాంటిక్ సన్నివేశాలను ఆశించిన అభిమానులకు ఒకింత నిరాశ తప్పదు. అయితే భార్య భర్తలుగా మాత్రం వారిద్దరి మద్య ర్యాపో ఎలా ఉంటుంది.. అసలు ఇద్దరి కాంబో సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

ఎర్ర చందనంను స్మగ్లింగ్‌ చేసే పుష్ప రాజ్ ను ఆయన భార్య సమర్థిస్తుందా లేదంటే భయంతో వద్దంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పుష్ప సినిమాకు సంబంధించిన ఈ కథ తో సినిమాపై కొందరిలో మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటి వరకు రష్మిక కనిపించిన పాత్రలకు చాలా విభిన్నంగా ఈ పాత్ర ఉంటుంది అనేది టాక్. అల్లు అర్జున్‌ మరియు రష్మికలు భార్య భర్తలుగా ఖచ్చితంగా ఆకట్టుకుంటారనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్ట్‌ 1 చివరి దశ షూటింగ్‌ ను నిర్వహిస్తున్నారు. త్వరలోనే సినిమాను ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు.