Begin typing your search above and press return to search.
మెగా రీమేక్స్ పై మెగాస్టార్ ప్లాన్ అదేనా..?
By: Tupaki Desk | 18 Jan 2021 11:13 AM GMTమెగాస్టార్ చిరంజీవి రెండు రీమేక్ సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే. మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' మరియు తమిళ్ హిట్ సినిమా 'వేదలమ్' లను చిరంజీవి రీమేక్ చేయనున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న 'లూసిఫర్' తెలుగు వెర్షన్ కి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామా 'వేదలమ్' చిత్రాన్ని చిరు తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలను లైన్ లో పెట్టిన చిరంజీవి.. ముందుగా ఏ చిత్రాన్ని టేకాఫ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది సెట్స్ పై ఉండగానే 'లూసిఫర్' రీమేక్ ని జనవరి 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. 'ఆచార్య' షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మోహన్ రాజా సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మెగాస్టార్ ఇంకా లేట్ చేయకుండా మెహర్ రమేష్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. 'వేదళమ్' తెలుగు రీమేక్ ని ఫిబ్రవరిలో పట్టాలెక్కించి.. 'లూసిఫర్'తో పాటు ప్యారలల్ గా చిత్రీకరణ చేయాలని ఆలోచిస్తున్నారట. మెగాస్టార్ ఈ రెండు సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.