Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో ఆచార్యుడి హంగామా వున్నట్టా లేనట్టా?
By: Tupaki Desk | 8 April 2022 4:28 AM GMTమన స్టార్ హీరోల చిత్రాల్లో ప్రతీ మూవీ ఇప్పడు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి. అయితే ఓ సినిమా విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల ఇదే తరహా కన్ఫ్యూజన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' విషయంలోనూ నెలకొంది. ఒకేసారి తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. దీనిపై వరుస కథనాలు కూడా వినిపించాయి. అయితే హిందీ వెర్షన్ మాత్రం ఇంత వరకు రిలీజ్ కాలేదు. అఫీషియల్ గా హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు కూడా.
బి4యు మోషన్ పిక్చర్స్ ఈ మూవీని హిందీలో రిలీజ్ చేయబోతోంది. ఇదిలా వుంటే ఇదే తరహా కన్ఫ్యూజన్ మరో స్టార్ సినిమాకి తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' తరువాత చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ ఇప్పటికే పలు సార్లు రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, లిరికల్ వీడియోస్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవలే ప్రచార కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఓ ప్లాన్ ని సిద్ధం చేసుకుని దాని ప్రకారం ప్రచార పర్వాన్ని హోరెత్తించడానికి రెడీ అవుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి చర్చకు దారితీస్తోంది.
బాలీవుడ్ లో ఆచార్యుడి హంగామా వున్నట్టా లేనట్టా? అని నెటిజన్ లు చర్చించుకుంటున్నారట. అయితే మేకర్స్ మాత్రం ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, త్వరలోనే ఆ విషయాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు హిందీలో మంచి మార్కెట్ వుంది. ఇటీవల ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ కు బాలీవుడ్ లో మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అది 'ఆచార్య'కు ప్లాస్ అవుతుందనే ఆలోచనతో మేకర్స్ ఈ మూవీని కూడా హిందీలో విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి మాత్రం దీనిపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బాలీవుడ్‌లో ఆచార్యుడి హంగామా వున్నట్టా లేనట్టా? అని అంతా చర్చించుకుంటున్నారు.