Begin typing your search above and press return to search.
'ఆచార్య' బయ్యర్లకు సెటిల్మెంట్ తప్పదా?
By: Tupaki Desk | 2 May 2022 11:30 PM GMTఓవైపు మెగాస్టార్ చిరంజీవి.. ఇంకోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. మరోవైపేమో కొరటాల శివ.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆచార్య’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందని అనుకున్నారు. కానీ అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయిన ఈ చిత్రం దారుణ ఫలితాన్ని చవిచూస్తోంది. అసలు రిలీజ్ ముంగిటే ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడం పెద్ద షాక్ అంటే.. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, వీకెండ్లో కూడా సరైన వసూళ్లు రాబట్టలేకపోవడం ఇంకా పెద్ద షాక్. ‘ఆచార్య’ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.140 కోట్లు పలికితే.. ఇందులో సగం కూడా వెనక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
తొలి రోజు రూ.30 కోట్ల షేర్‌తో ఓకే అనిపించినా.. శని, ఆదివారాల్లో వసూళ్లు కనీస స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ మార్కును కూడా అందుకున్న సూచనలు కనిపించడం లేదు. వీకెండ్లోనే సత్తా చాటలేకపోయిన సినిమా.. వీక్ డేస్‌లో స్ట్రాంగ్‌గా నిలబడుతుందని ఎలా ఆశిస్తాం? ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం నుంచి అద్భుతాలేమీ ఆశించే పరిస్థితి కనిపించడం లేదు.
‘ఆచార్య’ను రికార్డు రేట్లకు కొన్న బయ్యర్లు నిలువునా మునిగినట్లే కనిపిస్తోంది పరిస్థితి. రికవరీ 40 శాతానికి మించే అవకాశాలు లేనట్లే. రిలీజ్ ముంగిట బజ్ లేకపోయినా.. చిరు-చరణ్-కొరటాల కాంబినేషన్ చూసి ముందే జరిగిన అగ్రిమెంట్ల ప్రకారం సినిమాను కొన్న బయ్యర్లకు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.
స్వల్ప నష్టాలైతే నిర్మాతలు తప్పించుకోవచ్చు కానీ.. ఈ స్థాయిలో నష్టపోయిన బయ్యర్లను ఆదుకోకుంటే కష్టం. చిరు, చరణ్, కొరటాల సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పదు. వారి నుంచి కూడా త్యాగాలు అవసరం పడొచ్చు. తాము ముగ్గురం ఇంకా రెమ్యూనరేషన్లే తీసుకోలేదని కొరటాల రిలీజ్ ముంగిట చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పారితోషకాల్లో చాలా వరకు కోత పడొచ్చు.
నిర్మాతలతో కలిసి బయ్యర్లకు సెటిల్ చేయాల్సిన బాధ్యత చిరు మీద ఉంది. అనధికారిక ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ, పరిశ్రమ సమస్యల్ని పరిష్కరిస్తూ, కార్మికులకు అండగా నిలుస్తున్న చిరంజీవి.. తన సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లను వదిలేయలేడు. కొంత మేర నష్టాలు భర్తీ చేయడం, మ్యాట్నీ బేనర్లోనే ఇంకో సినిమా చేసి బయ్యర్లను ఆదుకోవడం లాంటివి చేయక తప్పదు. ‘ఆచార్య’ టీం ఈ దిశగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.