Begin typing your search above and press return to search.

అలియాభ‌ట్ దూరం వెనుక అంత క‌థ‌ ఉందా?

By:  Tupaki Desk   |   28 March 2022 7:42 AM GMT
అలియాభ‌ట్ దూరం వెనుక అంత క‌థ‌ ఉందా?
X
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. సినిమా విడుద‌ల ఆల‌స్య‌మైన టీమ్ ని సినిమా స‌క్సెస్ జోష్ లో నింపేసింది. వాయిదాల పర్వం సినిమాపై ఏమాత్రం ప్రభావం చూప‌లేదు. రాజ‌మౌళి సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పంచ్ ప‌వ‌ర్ ఒకేలా ఉంటుద‌ని మరోసారి నిరూపిత‌మైంది.

ఇక సినిమా రిలీజ్ స‌మ‌యంలో చ‌ర‌ణ్-తార‌క్ -రాజ‌మౌళి త్ర‌యం ఏ రేంజ్ లో ప్ర‌చారం నిర్వ‌హించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి ధ‌పా ప్ర‌చారంలో లో నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేస్తే రెండో ధ‌పా ప్ర‌చారంలో నార్త్..సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల రౌండ‌ప్ చేసి ప్ర‌చారం నిర్వ‌హించారు. మొద‌టి విడ‌త ప్ర‌చారంలో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ కూడా ఎంతో చురుకుగా పాల్గొంది.

హిందీలో లసినిమాకి వీలైనంత బ‌జ్ తీసుకొచ్చే త‌న‌వంతు ప్ర‌య‌త్నం శ‌క్తి వంచ‌న‌ల లేకుండా చేసింది. అయితే రెండో విడ‌త ప్ర‌చారానికి అలియాభ‌ట్ దూరంగా ఉంది. కేవ‌లం ఢిల్లీలో మాత్ర‌మే టీమ్ తో హాజ‌రైంది. మిగ‌తా ఏ సంద‌ర్భంలోనూ జ‌క్క‌న్న త్ర‌యంతో క‌ల‌వ‌లేదు. అలాగే సినిమా రిలీజ్ త‌ర్వాత `ఆర్ ఆర్ ఆర్` గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎలాంటి పోస్ట్ కూడా పెట్ట‌లేదు.

దీంతో `ఆర్ ఆర్ ఆర్` బృందంతో అలియాకి ఉన్న స‌ఖ్య‌త చెడింద‌నే ప్ర‌చారం సాగుతోంది. క‌ర్ణాట‌క‌లో ని చిక్ బ‌ల్లాపూర్ లో జ‌రిగిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం అలియాభ‌ట్ హాజ‌రు కాలేదు. ఆ త‌ర్వాత నార్త్ లో వివిధ దేవాల‌యాల్ని జ‌క్క‌న్న అండ్ కో సంద‌ర్శించింది. అప్పుడు కూడా అలియాభ‌ట్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇలా టోట‌ల్ గా రెండో ధ‌పా ప్ర‌చారానికి అలియా భ‌ట్ దాదాపు దూరంగానే మొలిగింది.

అయితే దీనికి కార‌ణాలు సినిమాలో ఆమె పాత్ర చిన్న‌దిగా ఉండ‌టంతో హ‌ర్ట్ అయింద‌ని...త‌న‌పై షూటింగ్ చేసిన చాలా స‌న్నివేశాలు ఎడిటింగ్ లో తీసేసార‌ని అలియా భ‌ట్ అసంతృప్తితో ఉందిట‌. స్టోరీ చెప్పింది చెప్పిన‌ట్లు ఆన్ సెట్స్ లో త‌న‌పై చిత్రీక‌రించారుట‌.

కానీ తెర‌పై సినిమా చూసుకునే స‌రికి చాలా స‌న్నిశాల‌కు క‌త్తిరింపు ప‌డిన‌ట్లు..ఆ కార‌ణంగా అలియా భ‌ట్ రెండో విడ‌త ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేద‌ని..అలాగే రిలీజ్ త‌ర్వాత ఎలాంటి ట్వీట్ కూడా చేయ‌లేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వాలు ఏంటి? అన్న‌ది తెలియాల్సి ఉంది.