Begin typing your search above and press return to search.
సంక్రాంతి సినిమాలపై గట్టి ఎఫెక్ట్ పడనుందా?
By: Tupaki Desk | 24 Dec 2022 10:04 AM GMTప్రతీ ఏడాది పొంగల్ బరిలో క్రేజీ సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి అన్నది తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఎప్పటిలాగే క్రేజీ సినిమాలు పోటీపడబోతున్నాయి. 2022 సంక్రాంతికి అనుకున్న స్థాయిలో భారీ సినిమాలు బరిలోకి దిగకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే 2023 జనవరిలో రాబోతున్న సంక్రాంతి సమరానికి ఈ సారి భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. సీనియర్ హీరోల నుంచి చిన్న హీరోలు కూడా పోటీకి సై అంటున్నారు.
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో పక్క ప్రమోసన్స్ ని చిత్ర బృందం హోరెత్తిస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
ఇక ఈ మూవీకి ఒక్క రోజు ఆలస్యంగా అంటే జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ కాబోతోంది. బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని కూడా మైత్రీ వారే నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రకు మించిన పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపు 8ఏళ్ల విరామం తరువాత చిరుతో బాలయ్య సంక్రాంతికి పోటీపడుతుండటంతో ఈ రెండు సినిమాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ రెండు సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలతో పాటు తమిళ హీరో విజయ్ నటిస్తున్న 'వారసుడు' డబ్బింగ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. దిల్ రాజు తొలి సారి తమిళంతో నిర్మించిన సినిమా కావడం.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు భారీ స్థాయిలో థియేటర్లని బ్లాక్ చేసుకోవడంతో ఈ మూవీపై కూడా హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇక బోనీ కపూర్ నిర్మిస్తున్న అజిత్ 'తునీవు' తెలుగులో 'తెగింపు' గా రాబోతోంది. ఈ రెండు కూడా జనవరి 12నే రిలీజ్ కాబోతున్నాయి. ఇక యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న 'కల్యాణం కమనీయం' కూడా జనవరి 14న రిలీజ్ కు రెడీ అవుతోంది.
అంతా బాగానే వుంది కానీ ఈ సంక్రాంతి సినిమాలకు సరికొత్త భయం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కోరలు చాస్తున్న వేళ పొంగల్ సినిమాలకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ఇప్పటికే మాస్కులు, భౌతిక దూరం పాటించండి అంటూ ప్రకటనలు చేస్తున్న వేళ సంక్రాంతి సినిమాల పరిస్థితేంటనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే మన దగ్గర పెద్దగా ప్రభావం వుండకపోవచ్చు కానీ ఓవర్సీస్ లో ఏమైనా గట్టి ఎఫెక్ట్ పడనుందా? అనే చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.