Begin typing your search above and press return to search.

నీది నాది కాంబో..ఇదేం చాటింగ్ మ‌నోజ్‌ మ‌చ్చా?

By:  Tupaki Desk   |   19 Dec 2022 12:46 PM GMT
నీది నాది కాంబో..ఇదేం చాటింగ్ మ‌నోజ్‌ మ‌చ్చా?
X
మంచు మ‌నోజ్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. 2017లో వ‌చ్చిన 'ఒక్క‌డు మిగిలాడు' మూవీ త‌రువాత మంచు మ‌నోజ్ మ‌రో సినిమా చేయ‌లేదు. దాదాపు ఐదేళ్లుగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న మంచు మ‌నోజ్ మ‌ళ్లీ కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తానంటూ ప్ర‌క‌టించాడు. త్వ‌ర‌లో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నాన‌ని మంచు మ‌నోజ్ శుక్ర‌వారం ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంచు మ‌నోజ్‌ రెండో పెళ్లికి కూడా రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా మంచు మ‌నోజ్.. క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ తో చేసి వాట్సాప్ చాట్ నెట్టింట లీకైంది. సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా హీరో మంచు మ‌నోజ్ ఈ వాట్సాప్ చాట్ ని లీక్ చేశాడు. అయితే ఇందులో సీరియ‌స్ మాట‌ర్ వుంద‌నుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. స‌ర‌దాగా క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్‌, త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌కు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్ల‌ని మంచు మ‌నోజ్ అభిమానుల‌తో పంచుకున్నాడు.

విచిత్ర‌మైన సంభాష‌ణ ఈ వాట్సాప్ చాట్ లో వుండ‌టంతో ఇది ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇద్ద‌రు తెలుగురాని వ్య‌క్తులు విచిత్ర‌మైన తెలుగులో మాట్లాడుతున్న‌ట్టుగా ఈ చాటింగ్ సాగింది. నాది ఆగ్రాలో వుంది. మీది ఎక్క‌డ వుంది చిచ్చా? అని వెన్నెల కిషోర్ అడిగితే.. 'నాది హైద‌రాబాద్ లో వుంది' అని మంచు మ‌నోజ్ రిప్లై ఇవ్వ‌డం.. వ‌చ్చాక మీకి టైమ్ ఇస్తే మీది క‌లుస్తా నాది' అని కిషోర్ అన‌డం.. హ హ హ డ‌న్ ' అని మనోజ్ చెప్ప‌డం నెట్టింట న‌వ్వులు పూయిస్తోంది.

మ‌చ్చా నీది హైద‌రాబాద్ కు వ‌చ్చిందా? అని మ‌నోజ్‌.. '22 నైట్ కి వ‌స్తుంది నాది.. అని వెన్నెల కిషోర్.. దానికి 'నాది ఎదురు చూస్తుంది నీది కోసం' అంటూ మంచు మ‌నోజ్ రిప్లై ఇవ్వ‌డంతో నెట్టింట న‌వ్వులు పూస్తున్నాయి. నీది నాది కాంబో..ఇదేం చాటింగ్ మ‌నోజ్‌ మ‌చ్చా? అంటూ నెటిజ‌న్ లు మంచు మ‌నోజ్‌, వెన్నెల కిషోర్ ల‌పై ఫ‌న్నీ కామెంట్ చేస్తూ వీరిద్ద‌రి వాట్సాప్ చాట్ ను మ‌రింత‌గా నెట్టింట‌ వైర‌ల్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.