Begin typing your search above and press return to search.
‘బంగార్రాజు’పై నాగార్జున ప్లాన్ ఇదేనట?
By: Tupaki Desk | 1 Nov 2021 10:58 AM GMTసంక్రాంతి బరిలో ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ ను రాజమౌళి దించగానే ప్రత్యర్థులంతా వైదొలిగి సమ్మర్ కు షిఫ్ట్ అయిపోయారు.ఇప్పటికే మహేష్ బాబు తన ‘సర్కారు వారి పాట’ను ఏప్రిల్ కు వాయిదా వేసేశారని టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ , బాలయ్య ‘అఖండ’ లాంటి మూవీలు కూడా పోస్ట్ పోన్ చేయడం ఖాయమని అంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం తన ‘రాధేశ్యామ్’ ప్యాన్ ఇండియా చిత్రాన్ని సంక్రాంతి బరిలోనే నిలిపాడు. ఇప్పటికే వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ దించినా విడుదలకు రెడీ అయిపోయాడు.
వీరందరిదీ ఒక ఎత్తు అయితే.. అగ్ర హీరో నాగార్జున మాత్రం ఏమాత్రం భయపడకుండా తన సినిమాను 2022 సంక్రాంతి రేసులో పందెంకోడిలా నిలిపాడు. ఆర్ఆర్ఆర్ ధాటికి పెద్ద చిత్రాలు భయపడిపోతుంటే నాగార్జున సినిమా ‘బంగార్రాజు’ను కూడా సంక్రాంతి రేసులోకి దించేస్తున్నారట.. నాగార్జున ఈ విషయంలో సీరియస్ గా ఉన్నాడట.. తన ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాకు సంక్రాంతికి మించిన సీజన్ లేదన్నది నాగార్జున అభిప్రాయం.
సొగ్గాడే చిన్ని నాయన మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. ఇప్పుడుదానికి ప్రీక్వెల్ గా తీసిన ‘బంగార్రాజు’ను సంక్రాంతికే తేవాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడట.. ఈ సీజన్ మిస్ అయితే ఆ సినిమాకు ఫ్లేవర్ ఉండదని భావిస్తున్నాడట..
సంక్రాంతి అంటేనే పండుగ సీజన్ అని తన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రానికి ఇదే కరెక్ట్ సమయం అని నాగార్జున భావిస్తున్నారట.. ఎన్ని భారీ చిత్రాలు వచ్చినా జనం చూస్తారని.. ఆర్ఆర్ఆర్ కు పోటీగా నిలపాల్సిందేనని నాగార్జున డిసైడ్ అయినట్టు సమాచారం.