Begin typing your search above and press return to search.
ఇదేందయ్యా.. హిందీ 'జెర్సీ' ని తెలుగులో డబ్ చేస్తున్నారా..?
By: Tupaki Desk | 8 Feb 2022 7:37 AM GMTతెలుగులో నాని - శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ''జెర్సీ'' ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే టైటిల్ తో ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్ - మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ ప్లే చేసారు. అప్పుడెప్పుడో పూర్తైన ఈ సినిమా.. కరోనా పాండమిక్ పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే 2022 మార్చి 18న రిలీజ్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయనే విషయం తెలిసిందే. దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే అధికారిక రీమేక్ అయిన హిందీ ''జెర్సీ'' చిత్రాన్ని మళ్ళీ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన సినిమా కావడంతో బాలీవుడ్ 'జెర్సీ' పై ఇక్కడి జనాల ఫోకస్ కూడా ఉంది. అందుకేనేమో మొదటి నుంచీ మేకర్స్ తెలుగు సర్కిల్స్ లోనూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగులోనూ డబ్ చేస్తున్నారనే వార్తలపై సోషల్ మీడియాలో సెటైర్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో ఆల్రెడీ అందరూ చూసేసిన సినిమాని మళ్ళీ డబ్బింగ్ చేయడమంటే డబ్బులు వృధా చేసుకోవడమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడిచే 'ఆహా' ఓటీటీ కోసమైనా తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'జెర్సీ' ని వాడేసుకోవచ్చు అని మరికొందరు కౌంటర్లు వేస్తున్నారు. ఇకపోతే హిందీ వెర్షన్ కు సంబంధించిన సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉంటే.. శాటిలైట్ హక్కులు జీ గ్రూప్ వద్ద ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ - స్పెషల్ పోస్టర్స్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
హిందీ 'జెర్సీ' చిత్రానికి సచేత్-పరంపర సంగీతం సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో పాటుగా అనిరుద్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ మూవీ మన తెలుగు నిర్మాతలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.