Begin typing your search above and press return to search.
`అఖండ` గెటప్ వెనకుంది ఇతనే?
By: Tupaki Desk | 12 Dec 2021 3:30 AM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం `అఖండ`. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించడమే కాకుండా బాలయ్య - బోయపాటి కెరీర్‌లో అఖండమైన ఆదరణని సొంతం చేసుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం అనూహ్యంగా వసూళ్లని రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.
రైతుగా, అఘోర గా అఖండ పాత్రలో కనిపించారు. ఇందులోని అఖండ పాత్ర, ఆ పాత్ర మేకోవర్ ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఈ పాత్రని తీర్చి దిద్దిన తీరు, బాలకృష్ణ ఆహార్యం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే సినిమాకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ పాత్ర మేకోవర్ వెనక బోయపాటి కాకుండా వేరే వ్యక్తి వున్నాడని తెలిసింది. అతనే రామ్జ్. ఈ చిత్రంలోని అఖండ పాత్రకు సంబంధించిన గెటప్‌ని డిజైన్ చేసింది.. ఈ పాత్ర వెనక వుంది అతనే అని తెలిసింది.
సినిమాలోని మురళీకృష్ణ, అఖండ పాత్రలని ఎలివేట్ చేయడం కోసం కాస్ట్యూమ్స్‌ని కూడా ఆయనే డిజైన్ చేశారట. ఓ పాత్ర వేసే వైట్ పంచ.. అలాగే అఖండ పాత్ర వేసే బ్లాక్ డ్రెస్ కోడ్.. పైన ధరించే కాశాయ వస్త్రం.. మెడలో వేసుకునే రుద్రాక్ష మాలలు..అంతే కాకుండా లెదర్ వస్తువులు... చేతులపై టాటూలు.. శివుడి మూడో నేత్రం.. చేతిలో ధరించే త్రిశూలం రామ్జ్ డిజైన్ చేసినవే కావడం విశేషం.
అవే అఖండ పాత్రని ఓ స్థాయిలో ఎలివేట్ చేసాయి. ఈ సందర్బంగా `అఖండ` పాత్రని, ఆయన ధరించే కాస్ట్యూమ్స్‌ని.. ఓవరాల్‌గా ఆయన మేకోవర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయాలనుకున్నామని ఈ సందర్భంగా రామ్జ్ వెల్లడించారు.
బోయపాటి శ్రీను ఈ పాత్రకు సంబంధించిన ఇన్ పుట్స్ ఇచ్చారని, అయితే ఈ పాత్రలో బాలకృష్ణ మేకోవర్ కొన్నేళ్ల పాటు గుర్తిండిపోవాలన అందు కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ప్రత్యేకమైన వస్త్రాలని తీసుకున్నాం. టూటూలు, ప్రత్యేకంగా శివలింగం రూపొందించాం` అని తెలిపారు రామ్జ్. సుకుమార్ రూపొందించిన `జగడం` సినిమాతో రామ్జ్, చంద్రిక రామ్జ్ హీరో కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేశారట.
అక్కడి నుంచే వీరి జర్నీ మొదలైంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, కింగ్ నాగార్జున తో పాటు రజనీకాంత్ రోబో చిత్రానికి కూడా వర్క్ చేశారట. ఇన్నేళ్లుగా రాని గుర్తింపు `అఖండ`తో లభించిందని రామ్జ్ ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న రామ్జ్ ఆసర్టిస్ట్ గా కూడా పని చేయడం గమనార్హం.