Begin typing your search above and press return to search.
చరణ్ ఆస్తులపై ఎందుకీ గోల?
By: Tupaki Desk | 10 Feb 2019 9:04 AM GMTమెగాస్టార్ వారసుడు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంత? గత కొంతకాలంగా సాగుతున్న ఆసక్తికర చర్చ ఇది. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా, బాక్సాఫీస్ బాద్ షాగా రాణిస్తున్న రామ్ చరణ్ తన మార్కెట్ రేంజును అంతకంతకు పెంచుకుంటున్నారు. ఇప్పటికే 100కోట్ల షేర్ (200కోట్ల క్లబ్ గ్రాస్) క్లబ్ హీరోగా సత్తా చాటారు. రంగస్థలం చిత్రంతో నాన్ బాహుబలి రికార్డుని తిరగరాసిన హీరోగా చరణ్ కి పేరుంది. నటించిన రెండో సినిమా (మగధీర)తోనే 80కోట్ల వసూళ్లు సాధించిన యంగ్ హీరోగా చరణ్ పేరు రికార్డులకెక్కింది.
సినిమాల పరంగా క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అని భావించే చరణ్ ఇప్పటివరకూ నటించింది కేవలం 12 సినిమాలు మాత్రమే. ఇతర హీరోలతో పోలిస్తే చాలా నెమ్మదిగా కెరీర్ ని సాగిస్తున్నాడు. అయినా అతడి ముఖ విలువ, బిజినెస్ వ్యాపకాలు ఆశ్చర్యం కలిగించే రిజల్ట్ ని అందిస్తున్నాయి. ఓవైపు విమాన యాన రంగంలో ట్రూజెట్ యజమానిగా చరణ్ పేరు వినిపిస్తోంది. మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేతగా వరుసగా భారీ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఖైదీనంబర్ 150 చిత్రంతో 150 కోట్ల వసూళ్లు అందుకుని, ఇప్పుడు ఏకంగా అంతకుమించిన బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు చరణ్. మెగా వారసుడిగా ఆస్తిమంతుడు.. స్థితిమంతుడు.. బ్రాండ్ వ్యాల్యూ ఉన్న మగధీరుడు కావడంతో అతడి ఆస్తుల విలువ దాదాపు 1300 కోట్లకు చేరిందని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా ప్రకటించడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది.
చరణ్ ప్రస్తుతం కొత్త ఇంట్లోకి దిగేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారట. ఈ ఇంటి ఖరీదు ఏకంగా 38 కోట్లు అంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఇండస్ట్రీ బెస్ట్ లివింగ్ హోమ్ ని చరణ్ - ఉపాసన జంట నిర్మించుకుంటున్నారట. ఇందులో అధునాతన వసతులు, అద్భుతమైన రక్షణకు సంబంధించిన ఫీచర్స్ ఇన్ బిల్ట్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆస్టన్ మార్టిన్ కార్, బెంజ్ సహా పలు ఇంపోర్టెడ్ కార్లతో గ్యారేజ్ ఎప్పుడూ రీసౌండ్ తోనే ఉంటుందిట. హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు సహా బెంగళూరు, చెన్నయ్ వంటి చోట్ల ఆస్తులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఓవరాల్ గా 1300 కోట్ల మేర నికర ఆస్తులు చరణ్ పేర ఉంటాయని ఓ అంచనాని వెలువరించింది సదరు కథనం. ఇక చరణ్ ఈ రేంజును డబుల్ చేయడానికి ఇంకెంతో సమయం పట్టదని ప్రస్తుతం అతడి స్పీడ్ చూస్తుంటే అర్థమవుతోంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రం అతడి మార్కెట్ రేంజును మరింతగా పెంచనుంది. యూనివర్శల్ హీరోగా తనని తాను ఆవిష్కరించుకుని సత్తా చాటేందుకు చరణ్ ప్రిపేర్డ్ గా ఉన్నారు. అందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ స్టార్ డమ్ ని పెంచుకుంటున్నారు చరణ్.